Borugadda Anil Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు బొరుగడ్డ అనిల్, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్
అతనికి 14 రోజులు రిమాండ్ విదించడం జరగింది
Guntur, Oct 18: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొరుగడ్డ అనిల్ కుమార్ నీ అరెస్టు చేశామని,రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అతనికి 14 రోజులు రిమాండ్ విదించడం జరగింది.అనిల్ పై 17కేసులు వున్నాయి.ఈ కేసులన్నీ యాక్టీవుగా వున్నాయి.2021 లో 50 లక్షల డిమాండ్ చేసి కత్తి చూపి బెదిరించిన కేసు లో అరెస్టు చేశాం.
విశాఖపట్నంలో 150 కేజీల గంజాయి సీజ్, కారులో తరలిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కారు సీజ్
2019 లో అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో అనిల్ పై రౌడి షీట్ ఓపెన్ చేశారు.గుంటూరు లో అనిల్ పై 8 కేసు లు ఉన్నాయి.4 కేసులు విచారణ ప్రక్రియ లో వున్నాయి 4కేసులో పిటి వారెంట్ ఇవ్వడం జరిగింది.సోషల్ మీడియా లో ఇతను భాగా ఆక్టివ్ గా వుండేవాడు రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు.సోషల్ మీడియా నీ అందరు జాగర్తగా వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు.
గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్
బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
బోరుగడ్డ అనిల్ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఆయన కోసం పోలీసులు గాలించినా దొరకలేదు. ఆయన హైదరాబాద్, బెంగళూరులో కొంతకాలం తలదాచుకున్నట్లు ప్రచారం జరిగింది.. ఇటీవలే ఆయన గుంటూరుకు వచ్చారు. బోరుగడ్డ అనిల్‌పై గత ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని టీడీపీ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగారని తెలిపింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై.. రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను బెదిరించినట్లుగా. అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటంబసభ్యులు టార్గెట్‌గా అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయినట్లుగా టీడీపీ ఆరోపించింది.
కాగా జగన్ ఒక్కసారి కనుసైగ చేస్తే చంద్రబాబును లేపేస్తానంటూ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా అప్పుడు వైరల్ అయ్యింది. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదని వారు ఆరోపిస్తున్నారు.