International Yoga Day 2020: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేలా ప్రాణాయామం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది! అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

ఆ రకంగా కోవిడ్ -19 తో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ప్రాణాయామం' సహాయపడుతుందని అన్నారు....

PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, June 21:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం (జూన్ 21)న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసను నియంత్రించడాన్ని మెరుగుపరుస్తుంది. ఆ రకంగా కోవిడ్ -19 తో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ప్రాణాయామం' సహాయపడుతుందని అన్నారు.

"కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది అందరూ ఇంట్లోనే ఉండి యోగాను చేయాల్సి వస్తుంది. మనమందరం కుటుంబంతో కలిసి ఇంట్లోనే యోగా చేస్తున్నాం. యోగా ప్రజలను ఏకం చేస్తుంది, ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో యోగా మనకు సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు శ్వాసకోశ అనారోగ్యాలను నివారించడంలో ప్రాణాయామాలు మనకు ఎంతగానో సహాయపడతాయి" అని పీఎం మోదీ అన్నారు.

Here's what PM Modi said:

యోగా అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం వ్యక్తి యొక్క తపనను పెంచుతుంది. ఇది ఇతరుల పట్ల సంఘీభావం మరియు సోదరభావం పెంపొందించే ఒక శక్తిగా అవతరించింది, మానవ సంబంధాలను మరింత ధృడం చేస్తుంది. యోగాకు జాతి, రంగు, లింగం, అనే బేధాలు ఉండవు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ఇప్పుడు యోగా యొక్క ఆవశ్యకతను గ్రహించింది.

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే, అది వ్యాధిపై సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుంది. యోగాలో మన రోగనిరోధక శక్తిని పెంచే, శ్వాస సంబంధ ఇబ్బందులు తొలగించే మరియు జీవక్రియను మెరుగుపరిచే ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో యోగా మనకు చాలా సహాయపడుతుంది ”అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించిన కొన్ని నెలల తర్వాత, 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి తన సర్వసభ్య సమావేశంలో జూన్ 21ను 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' గా ప్రకటించింది. అప్పట్నించి భారత్ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తుంది.

 

 



సంబంధిత వార్తలు

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif