Animal Abuse in Kerala: ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్‌ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్‌‌ఐఆర్ నమోదు

కొందరు వ్యక్తులు బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను (pineapple firecrackers) ఏనుగు తినడంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై కేరళ పోలీసులు స్పందించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు.

Pregnant Elephant Dies After Eating Firecracker-Filled Kerala's Pineapple (Photo Credits: ANI)

Malappuram, June 3: ఆకలి తీర్చుకునేందుకు పైనాపిల్‌ పండును (Pineapple) తిన్నందుకు ఏనుగు దాని కడుపులో ఉన్న బుజ్జి ఏనుగు (Pregnant Elephant Dies) చనిపోయాయి. కొందరు వ్యక్తులు బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను (pineapple firecrackers) ఏనుగు తినడంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై కేరళ పోలీసులు స్పందించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. నగల కోసం భార్యని పాముతో రెండు సార్లు కరిపించాడు, కేరళలో ఓ భర్త ఘాతుకం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

మన్నర్‌క్కడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహన్ కృష్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. భరించలేని బాధతో ఊరంతా పరుగులు పెట్టిన ఆ ఏనుగు.. పక్కనే ఉన్న వెల్లియార్ నదిలోకి వెళ్లింది. కొద్దిసేపటికి అక్కడే అలా నదిలో నిలబడే ప్రాణాలు వదిలింది. దీనిపై తీవ్ర విమర్శలు రేకెత్తుతున్నాయి.

Here's ANI Tweet

వివరాల్లోకెళితే.. కేరళలోని పాలక్కడ్‌ జిల్లాకు (Palakkad) సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగు ఆహారం కోసం సమీపంలోని గ్రామ శివారులోకి వచ్చింది. అడవి పందుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్‌ పండ్లను పంటల రక్షణ కోసం ఉపయోగించేవారు. ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఏనుగు పైనాపిల్‌ను నోట్లోకి తీసుకోగానే బాణసంచా పేలడంతో ఏనుగు నాలుక, నోరుకు తీవ్రగాయాలయ్యాయి. మంటగలుస్తోన్న మానవత్వం, పేషెంట్ ఆటోని నిలిపివేసిన పోలీసులు, కిలోమీటర్ దూరం తండ్రిని మోసిన తనయుడు, కేరళలో లాక్‌డౌన్ వేళ హృదయ విదారక ఘటన

బాధ భరించలేక వెలియార్‌ నదీలోకి (Velliyar River) వెళ్లి అందులో నిలబడి కొంతసేపు సేదతీరింది. పేలుడు ధాటికి నోరు, తొండం కాలిపోయిడంతో నొప్పిని తగ్గించుకునేందుకు వాటిని ఎప్పుడూ నీటితో నింపుకుంది. కాలిన గాయాల మీద ఈగలు, కీటకాలు వాలకుండా అలా చేసిందని ఫారెస్ట్‌ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తెలిపారు. ఏనుగుకు గాయాలైన విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. మే 27న సాయంత్రం 4 గంటలకు నది మధ్యలోనే ఏనుగు మృతిచెందిందని ఆయన వెల్లడించారు. ఏనుగును అడవిలోకి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఆ ఏనుగు ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయలేదని, చాలా మంచిదని అన్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు చెందిన అధికారి మోహన్‌ కృష్ణన్‌ ఈ దుశ్చర్యను సోషల్‌మీడియాలో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పైనాపిల్‌ పండు తినడంతో నోట్లో పేలుడు సంభవించిందని, దీంతో ఏనుగు మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు వివరించారు. ఏనుగుకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్‌ మాట్లాడుతూ..బాధిత ఏనుగు కడుపులో నెలరోజుల గున్న ఏనుగు ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఏప్రిల్ మాసంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి సంభవించింది. కొల్లాంలో జిల్లాలోని పఠానాపురం అడవుల్లో ఓ యువ ఆడ ఏనుగు కూడా ఇలాగే మరణించింది. అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఉన్న ఆ ఆడ ఏనుగును తాము పఠాన్‌పూర అడవుల్లో గత నెలలో గుర్తించామని అన్నారు. ఆ ఏనుగు మంద నుంచి తప్పిపోయి... గాయాలతో కనిపించిందని తెలిపారు.దాని దవడ విరిగిపోయిందని, ఆహారం తీసుకోలేక తీవ్ర అవస్థకు గురైందన్నారు. ఆ తరువాత చికిత్స అందిస్తుండగా అది చనిపోయిందని అధికారులు వెల్లడించారు.