Kerala Heartbreaking Video: మంటగలుస్తోన్న మానవత్వం, పేషెంట్ ఆటోని నిలిపివేసిన పోలీసులు, కిలోమీటర్ దూరం తండ్రిని మోసిన తనయుడు, కేరళలో లాక్‌డౌన్ వేళ హృదయ విదారక ఘటన
Kerala Heartbreaking Video kerala-man-forced-carry-father-his-arms (Photo-ANI)

Kollam, Kerala, April 16: కేరళలో విధించిన లాక్ డౌన్ (Kerala Lockdown) ఆ తండ్రీ కొడుకులకు శాపంగా పరిణమించింది. అస్వస్థుడైన తండ్రిని డిశ్చార్జి తరువాత ఇంటికి తీసుకువెళ్లడానికి ఆ కొడుకుకి లాక్ డౌన్ శాపంలా మారింది. ఫలితం తన చేతుల మీదుగా పేషంట్ అయిన తండ్రిని కిలోమీటర్ దూరం ఆ కొడుకు మోసాడు. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లంలో జరిగింది.

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనావైరస్, హోమ్ క్వారంటైన్‌లోకి 72 కుటుంబాలు

కాగా ఈ ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్‌ (Kerala State Human Rights Commission) విచారణకు ఆదేశించింది. సుమోటో కేసు (suo moto petition) రిజిస్టర్ చేసింది. ఆ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. జిల్లా ఎస్‌పీ నుంచి ఈ ఘటనపై రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ మానవ హక్కుల సంఘం తెలిపింది. 400 దాటిన కరోనా మృతులు, దేశంలో 12 వేలు దాటిన కరోనా కేసులు

కేరళలోని (Kerala) కొల్లంలో అస్వస్థుడై.. ఆసుపత్రి పాలై కోలుకున్న ఆ తండ్రిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. ఆయన కొడుకు తన తండ్రిని ఆటోలో ఇంటికి తీసుకువెళ్తుండగా .. మధ్య దారిలోనే లాక్ డౌన్ ఉందని,, ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు ఆపేశారు. హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూపినా వారు కరుణించలేదు. దీంతో ఆ కుమారుడు తన తండ్రిని భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ దూరం మేరా ఎండలో నడుచుకుంటూ తీసుకువెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Here's ANI Video

అయితే పోలీసుల కథనం వేరేలా ఉంది. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. కాగా పులనూరు సీఐ ముందుగా తనను ఆటో డాక్యుమెంట్లు అడగ్గా అన్ని చూపించానని రోయ్‌మన్‌ తెలిపారు. అయినా ఆటోను ఆసుపత్రి వరకు అనుమతించలేదన్నారు. విషాదం ఏమిటంటే తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్‌మన్‌ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు కూడా స్పందించలేదు.

బుధవారం నాటికి కేరళలో 387 కరోనావైరస్ కేసులు ఉన్నట్లు నిర్ధారించబడింది. వీటిల్లో 167 క్రియాశీల కేసులు, 218 రికవరీలు మరియు 2 మరణాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన విషయం విదితమే.