New Delhi, April 16: దేశంలో కరోనావైరస్ (Deadly COVID 19 in India) రోజురోజుకి విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు భారత్‌లో 12,380 మందికి కోవిడ్ 19 (COVID 19) పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. 414 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,477 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదుకాగా, 187 మంది మృతిచెందారు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ సడలింపులు
అయితే దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో మాత్రం.. పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది. అక్కడ కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు సత్ఫలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేరళలో ఇప్పటివరకు 388 కరోనా కేసులు నమోదుకాగా, అందులో 218 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతిచెందారు. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 650, ఆంధ్రప్రదేశ్‌లో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ (1,561), తమిళనాడు (1,204), రాజస్థాన్ (1,005), మధ్యప్రదేశ్ (987), ఉత్తర ప్రదేశ్ (735), గుజరాత్ (695), తెలంగాణ (647) , ఆంధ్రప్రదేశ్ (503), కేరళ (387) కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా షాక్
COVID-19 కేసుల సంఖ్య పెరగడంతో, భారతదేశం పరీక్షలను వేగవంతం చేసింది. కరోనావైరస్ గుర్తింపు కోసం బుధవారం నాటికి మొత్తం 2,74,599 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. ఏప్రిల్ 15 న ఒకే రోజు 28,941 నమూనాలను పరీక్షించారు. ఇది 176 ప్రభుత్వ ప్రయోగశాలలు మరియు 78 ప్రైవేట్ ప్రయోగశాలల జాబితాను విడుదల చేసింది. COVID-19 పరీక్ష కోసం.
కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని రెడ్‌జోన్‌లో 170 హాట్‌స్పాట్ జిల్లాలను వర్గీకరించగా, 207 హాట్‌స్పాట్ కాని జిల్లాలను క్లస్టర్‌లు, సోకిన జిల్లాలను గ్రీన్ జోన్‌గా వర్గీకరించారు. కేంద్రం హాట్‌స్పాట్ జిల్లాలను రెడ్ జోన్‌గా పేర్కొంది, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో COVID-19 కేసులు ఉన్నాయి.