Coronavirus in India (Photo Credits: IANS)

Mumbai, April 15: దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Coronavirus) తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases) 11 వేలు దాటింది. బుధవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు.

 స్వీయ నిర్భంధంలో గుజరాత్ సీఎం విజయ్ రూాపానీ

దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా ( COVID 19)నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 38 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 377 మంది కరోనాతో మరణించారు.

దేశవ్యాప్త లాక్డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 178 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 30, తమిళనాడు 12, రాజస్తాన్‌ 11, మధ్యప్రదేశ్‌ 53, గుజరాత్‌ 28, ఉత్తరప్రదేశ్‌ 8, కర్ణాటక 10, కేరళ 3, జమ్మూకశ్మీర్‌ 4, హరియాణా 3, పశ్చిమ బెంగాల్‌ 7, పంజాబ్‌ 13 మంది మృతి చెందారు.ఇక అత్యధికంగా మహరాష్ట్రలో 2,684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రధాన మోది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Here's ANI Tweet

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, డీజీపీను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కరోనా వైరస్‌పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు

లాక్‌డౌన్‌కు సంబంధించి కొన్ని సేవలకు ఏప్రిల్‌ 20 నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని రాజీవ్ గౌబ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇతర వస్తువులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకోగా ఏప్రిల్ 20 నుంచి మరిన్ని సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.