Gujarat, April 15: గుజరాత్ (Gujarat) జమాల్పూర్ ఖాడియాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇమ్రాన్ ఖేదవాలా (Congress MLA Imran Khedawala) కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన ఒకరోజు తర్వాత గుజరాత్ సీఎం రూపానికి (Gujarat CM Vijay Rupani) కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే ఆయనకు కరోనా (COVID-19) నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ అతుల్ పటేల్, ఆర్.కె. పటేల్‌లతో కూడిన వైద్య నిపుణులు సిఎంకు ఇప్పటి వరకు లక్షణాలు లేవని ధృవీకరించారని సిఎం కార్యదర్శి అశ్వని కుమార్ తెలిపారు.
లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు
అయితే, భద్రతా చర్యల ప్రకారం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అతని నివాసంలో బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. కాగా కరోనాపై మంగళవారం ఉదయం సీఎం విజయ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలా హాజరయ్యారు.
అయితే సాయంత్రానికి ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముఖ్యమంత్రి రూపానితోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఇతర మంత్రులు, అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
రెండవ దశ దేశవ్యాప్త లాక్డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
కాగా రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న ఆరు హాట్‌స్పాట్లలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య క్రమంగా పెరుగూతూనే ఉన్నది. గుజరాత్‌లో కరోనాతో ఇప్పటివరకు 28 మంది చనిపోగా 650 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 11,400 కు, మరణాల సంఖ్య 377 కు పెరిగింది. పెరుగుతున్న సంఖ్యల దృష్ట్యా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు.