New Delhi, April 14: కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై (Lockdown) కేంద్ర హోంశాఖ (Home ministry) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలకు ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకు లాక్‌డౌన్ సందర్భంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుందని హోంశాఖ తెలిపింది.
ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
అయితే రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, సరఫరాల విభాగాలు, పోస్ట్ ఆఫీసులు, విపత్తుల నిర్వహణ, ముందస్తు హెచ్చరిక కేంద్రాలు, జాతీయ సమాచార కేంద్రాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ గుర్తింపు ఉన్న ఆర్ధిక సంస్థలు తదితర సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రాల విషయానికొస్తే.. పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీలు మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
. దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్
అటవీ శాఖ కార్యాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమీటీల నేతృత్వంలోని ‘మండీలు’ తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోల్డ్ స్టోరేజిలు, వేర్‌హౌస్ సర్వీసులు, నిత్యావసరాల రవాణా తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగనుంది.
లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు
నిత్యావసర వస్తువుల కొరత తలెత్తకుండా సరుకు రవాణా వాహనాలు తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ రాష్ట్రం కూడా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ తిరగకుండా ఆంక్షలు విధించొద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ రూపొందించింది. ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన లారీలు, ట్రక్కులు తదితర వెహికల్స్ కేంద్రం ఆదేశాలతో రోడ్డెక్కుతున్నాయి.
ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు
ఆస్పత్రులు, వెటర్నరీ ఆస్పత్రులు, ఫార్మసిటీలు, లేబొరేటరీలు, క్లినిక్‌లు సహా అన్ని వైద్య, ఆరోగ్య సంబంధిత విభాగాలు కూడా యధాతథంగా పనిచేస్తాయి. వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రయాణ సౌకర్యాలను కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుంది. కాగా నిత్యవసరాలు మినహా అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు లాక్‌డౌన్ సమయంలో మూసివేస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు, అత్యవసర ఐటీ సేవలకు లాక్‌డౌన్ నుంచి యధాతథంగా మినహాయింపు ఉంటుంది.
పారిశ్రామిక సంస్థలు, ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లకు లాక్‌డౌన్ సమయంలో నిషేధం కొనసాగనుంది. ఫిబ్రవరి 15 తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన విదేశీయులకు క్వారంటైన్ నిబంధనలను కఠినంగా కొనసాగించనున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. లాక్‌డౌన్ మినహాయింపులతో సంబంధం లేకుండా అన్ని చోట్లా సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నియమాలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. జిల్లా యంత్రాంగాలు దీని బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది.
కాగా అన్ని రకాల గూడ్స్ బండ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడా గూడ్స్ వెహికల్స్ను ఆపొద్దని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ర్టంలో, ఇతర రాష్ట్రాల్లో తిరిగే వాటికి ఆంక్షలు విధించ వద్దంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ రూపొందించింది. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. వాహనంలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తే ఉండాలని సూచించింది. ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
సోమవారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు లెటర్‌రాశారు. గైడ్లైన్స్ అమలు చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన వెహికల్స్.. కేంద్రం ఆదేశాలతో రోడ్డెక్కుతున్నాయి. వివిధ పరిశ్రమల నుంచి లారీలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇక హైవేలపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. కాగా రేపు లాక్‌డౌన్ నిబంధనలపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కేంద్రం గైడ్‌లైన్స్
అన్ని గూడ్స్ వాహనాలకు పర్మిషన్ ఇవ్వాలి. పాస్‌లతో నిమిత్తం లేకుండా స్థానిక, ఇతర రాష్ర్టాల ట్రక్కుల రాకపోకలకు అనుమతి ఇవ్వాలి.
డ్రైవర్‌తోపాటుమరో వ్యక్తికే పర్మిషన్. ప్రయాణికుల తరలింపుకు అనుమతి లేదు.
డ్రైవర్లు , క్లీనర్లు తమ పని ప్రాంతాలకు చేరుకునేలా స్థానిక ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇంటినుంచి ట్రక్స్ వద్దకు వెళ్తున్న డ్రైవర్స్, క్లీనర్స్‌ను ఆపవద్దు.
వర్కర్లు, వర్క్ ప్లేస్‌కు రావడానికి, పోవడానికి సహకరించాలి.
ఖాళీగా వెళ్తున్న ట్రక్కులు, గూడ్స్‌ను ఆపవద్దు.
లాక్డౌన్ ఆంక్షలనుంచి సడలింపు ఉన్న కంపెనీలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే పాస్‌లు అందించాలి.
చిన్నతరహా పరిశ్రమల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించాలి.
వాహనాల మూవ్‌మెంట్ కోసం ట్రక్కులను గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌లకు అనుమతించాలి. ఈ గైడ్‌లైన్స్ కంటైన్ మెంట్ ఏరియాలు, క్వారంటైన్, హాట్‌స్పాట్ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని పేర్కొంది.