PM Modi announcing lockdown till May 3 | (Photo Credits: ANI)

New Delhi, Aprlil 14: దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ (Lockdown extension in India) పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 14న‌(మంగ‌ళ‌వారం) జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ (PM Modi) దేశంలో కరోనా నియంత్రణకు పలువురు ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్ ను పరిగణనలోనికి తీసుకుని లాక్‌డౌన్‌ ను (Coronavirus Lockdown) మే 3వరకూ పొడిగించినట్లు చెప్పారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రజలు అందరూ కూడా మే 3 వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచించారు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు మోడీ. కరోనా హాట్ స్పాట్ ల మీద ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఏడు సూచనలు (PM Modi Saptapadi) చేసారు. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌లంద‌రై త‌ప్ప‌క పాటించాల్సిన ఏడు నియ‌మాల‌ను ప్ర‌ధాని వెల్ల‌డించారు.

మోదీ సప్తపది ఇది:

1. వయసు పైబడిన పెద్దవాళ్లను కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి.

2 అత్యవసర విధుల్లో ఉన్న డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలి.

3 పేదలకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించేందుకు వీలైనంత మేరకు మరింత సాయం అందించాలి.

4 ప్రైవేటు ఉద్యోగులు వేటు వేసే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు.

5 రోగ నిరోధక శక్తని పెంచుకునేలా, పౌషకాహారాన్ని తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి.

6. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి.

7 భౌతిక దూరం పాటించడంతో కరోనా దూరం అవుతుంది కాబట్టి, బయటకు వెళితే, ఒకరితో ఒకరు దగ్గరగా మెసలవద్దు.

ఈ ఏడు సూత్రాలనూ పాటించడం ద్వారా ఇండియా నుంచి కరోనాను శాశ్వతంగా పారద్రోల వచ్చని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలు వీటిని విధిగా పాటించాలని నమస్కరిస్తూ మోదీ కోరారు.