
New Delhi, April 14: దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి (Modi address to nation) ప్రసంగిచారు. కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు (India Lockdown Extended) నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళని చెప్పారు. లాక్‌డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండుగలు జరుపుకున్నామని ఆయన అన్నారు.
మే 3 వరకు దేశ పౌరులు అందరూ సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ఆయన చెప్పారు.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
కరోనా (COVID-19) విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను (Lockdown) మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.
ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు
మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం.
దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు.