COVID-19 in Dharavi: దేశానికి దిగులు పుట్టిస్తున్న ధారావి, ఏడు మంది కరోనా కాటుకు బలి, 55కు చేరిన కోవిడ్ -19 కేసుల సంఖ్య, ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
Coronavirus Death Toll in India (Photo-IANS)

Mumbai, April 14: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి (Dharavi COVID-19) దేశానికి దిగులు పుట్టిస్తోంది. ముంబైలో విస్తరించి ఉన్న ఈ మురికివాడలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా (6 New Cases), ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (Brihanmumbai Municipal Corporation (BMC)) పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు. దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్

ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అత్యంత సమీపంలో ఇళ్లు ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే దాన్ని నిరోధించడం కష్టమైన పని అని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది.

Here's the tweet:

దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించి నేటికి 21 రోజులు అవుతున్నా పాజిటివ్‌ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వందలు, వేల సంఖ్యల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. 31 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు

దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య దేశంలో 10,363కు చేరుకుంది. ఇప్పటివరకు 339 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని అధికార గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 17,76,867 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,11,828 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు

కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను (India Lockdown) పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. ఏప్రిల్‌ 20వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు.