Indian Railways (Photo Credits: PTI)

New Delhi, April 14: దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ (India Lockdown) పొడిగిస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఎక్కడి సర్వీసులు అక్కడే నిలిచిపోనున్నాయి. మరో 19 రోజుల పాటు రైళ్లు, విమానాలు అన్నీ బంద్ కానున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే (Indian Railways),సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ (Ministry of Civil Aviation) సంయుక్తంగా ప్రకటించాయి. మే 3 తర్వాత నడుస్తాయా లేదా అనేదానిపై ఇంక్లా క్లారిటీ లేదు. పరిస్థితులను బట్టి వెల్లడిస్తామని తెలిపాయి.

ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు

ప్రధాని మోదీ (PM Modi) లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈమేరకు ట్విట్టర్లో రైల్వే ఈ స్పష్టత ఇచ్చింది. ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Here's Tweets

 

తొలివిడత( ఏప్రిల్ 14) తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా ఆశించారు. రైల్వే అనుమతించడంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కూడా కొన్నారు. అయితే మే 3 వరకూ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికే కొన్ని టికెట్లకు వంద శాతం డబ్బు రిఫండ్ చేస్తామన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

దీంతో పాటుగా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. మే 3 అర్థరాత్రి వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోరాదని సూచించింది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా విమానాయాన శాఖ క్లారిటీ ఇచ్చింది.