Kollam Murder: నగల కోసం భార్యని పాముతో రెండు సార్లు కరిపించాడు, కేరళలో ఓ భర్త ఘాతుకం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Cobra | Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Kollam, May 25: పక్కా ప్లాన్‌తో కట్టుకున్న భార్యను (Kollam Murder) చంపేశాడు. కానీ.. అతని పాపం పండి విధి వక్రీకరించడంతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. ఈ విషాద ఘటన వివరాల్లోకెళితే.. పతనంతిట్ట జిల్లా అదూర్‌లో ప్రయివేట్ బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న సూరజ్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వివాహం సమయంలో అతనికి అత్తింటి వారు కట్నం రూపంలో 98 సవర్ల బంగారం ముట్టజెప్పారు. కానీ వరకట్నంపై దురాశ అతన్ని హంతకుడిలా (kerala man kills wife) మార్చింది. అమ్మాయే అబ్బాయి ఐడీతో గ్యాంగ్ రేప్ ఛాట్ చేసింది, బాయిస్ లాక‌ర్ రూమ్ కేసులో బయటపడ్డ ట్విస్ట్, 26 మంది విద్యార్థులు అరెస్ట్

ఏడాదిన్నర పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొద్ది రోజులుగా కలతలు మొదలయ్యాయి. సూరజ్‌ భార్యపై వరకట్న వేదింపులకు దిగాడు. ఉతారా కుటుంబం ఆర్థికంగా ఎటువంటి భరోసా ఇచ్చే దారి కపిపించకపోవడంతో తనను హత్యచేసి ఆ నేరాన్ని తనపైకి రాకుండా ఉండాలని ఆలోచించి ఓ పథకం వేశాడు. వెంటనే పథకాన్ని అమలు చేయాలని భావించి తనకు తెలిసిన సురేష్‌ అనే పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి రెండు పాములను (Two Snakes) రూ. 10,000లకు కొన్నాడు.

ఈ ఏడాది మార్చిలో భార్యను చంపాలని ప్రణాళికి సిద్ధం చేశాడు. అనుకున్నట్లుగానే ఆమె గదిలోకి పామును పంపించి ( Snake Bite) కరిపించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ఆ పాము కాటు తర్వాత చికిత్స పొందిన భార్య కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఆ తర్వాత కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మరోసారి మే 7న సూరజ్‌ నిద్రపోతున్న ఉతారాపై మరోసారి పామును వదిలాడు. ఈసారి పాముకాటుకు ఉతారా ప్రాణాలు కోల్పోయింది. సూరజ్ మాత్రం‌ తనకేమీ ఎరగనట్లు పామును చంపి ఇంట్లోనే ఉంటున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానంపై కలిగిన ఉతారా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణలో వ్యవహారం మొత్తం బయటపడింది.  మంటగలుస్తోన్న మానవత్వం, పేషెంట్ ఆటోని నిలిపివేసిన పోలీసులు, కిలోమీటర్ దూరం తండ్రిని మోసిన తనయుడు, కేరళలో లాక్‌డౌన్ వేళ హృదయ విదారక ఘటన

అత్తింటివారికి అనుమానం రావడంతో పోలీసు కేసు పెట్టారు. దీంతో పోలీసులు విచారణ చేయగా.. సూరజ్ హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. సూరజ్ పలుమార్లు పాములకు సంబంధించిన వీడియోలు మొబైల్‌లో చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్‌ విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చివరకు నిజాన్ని ఒప్పుకున్నాడు. సూరజ్‌కు రెండుసార్లు పాములు ఇచ్చి సహకరించిన సురేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు