Modi France Tour: పారిస్‌ బయల్దేరిన ప్రధాని మోదీ, రెండు రోజుల పాటూ బిజీ బిజీ షెడ్యూల్, బాస్టిల్ డే వేడుకల్లో గౌరవ అతిధిగా పాల్గొననున్న ప్రధాని

రేపు, ఎల్లుండి ఆయన ఫ్రాన్స్ లో (France) పర్యటించనున్నారు. ఇందుకోసం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పారిస్ (Paris) బయల్దేరారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు 14న జరిగే బాస్టిల్ డే వేడుకల్లో మోడీ (Narendra Modi departed) గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.

Modi France Tour (PIC@ ANI twitter)

New Delhi, July 13: ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. రేపు, ఎల్లుండి ఆయన ఫ్రాన్స్ లో (France) పర్యటించనున్నారు. ఇందుకోసం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పారిస్ (Paris) బయల్దేరారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు 14న జరిగే బాస్టిల్ డే వేడుకల్లో మోడీ (Narendra Modi departed) గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. మోడీని జులై14 పరేడ్‌కు స్వాగతించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు… . ఈ పర్యటనలో ప్రధాని దిగ్గజ సీఈవోలతో సమావేశం అవుతారని , ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని విదేశీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

కొద్దిరోజుల క్రితమే ఆయన అమెరికాలో పర్యటించారు. అక్కడ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ విదేశీ (Narendra Modi Tour) టూర్లు ఆసక్తికరంగా మారాయి. ఆయన పర్యటిస్తున్న దేశాల్లో మోదీకి అపూర్వస్వాగతం లభిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన అనంతరం 15న ప్రధాని అబుదాబిలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోడీ చర్చలు జరుపుతారు.