Narendra Modi Puja at the New ITPO Complex: నూతన ఐటీపీవో కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ, జీ20 లీడర్ల సమావేశానికి ఆతిధ్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమైన కాంప్లెక్స్
జీ 20 లీడర్ల సమావేశానికి వేదిక కానున్న ఐటీపీవో బిల్డింగ్ ను ఇటీవల సర్వాంగ సుందరంగా తీర్చిదద్దారు. ఐటీపీవో ప్రారంభత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ (Modi) పాల్గొన్నారు
New Delhi, July 26: అత్యాధునికంగా రీ డెవలప్ చేసిన ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ (ITPO Complex) ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జీ 20 లీడర్ల సమావేశానికి వేదిక కానున్న ఐటీపీవో బిల్డింగ్ ను ఇటీవల సర్వాంగ సుందరంగా తీర్చిదద్దారు. ఐటీపీవో ప్రారంభత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ (Modi) పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజల్లో పాల్గొని వేదపండతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంప్లెక్స్ ను రీ డెవలప్ చేశారు.G20 నాయకుల సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఢిల్లీ ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ ప్రపంచ స్థాయి ఎంఐసీఈ గమ్యస్థానంగా మార్చబడింది. సుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద ఎంఐసీఐ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా గర్వంగా ఉంది.
ఈవెంట్‌ల కోసం అందుబాటులో ఉన్న కవర్ స్పేస్ పరంగా.. రీడెవలప్ చేయబడిన, ఆధునిక ఐఈసీసీ కాంప్లెక్స్ ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో తన స్థానాన్ని పొందింది. జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (ఎన్‌ఈసీసీ) వంటి భారీ పేర్లకు పోటీగా ఉంది. ఐఈసీసీ స్థాయి, మౌలిక సదుపాయాల పరిమాణం ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను భారీ స్థాయిలో నిర్వహించగల భారతదేశ సామర్థ్యానికి నిదర్శనం.