Puja Khedkar Dismissed From IAS: పూజా ఖేద్క‌ర్ కు కేంద్రం షాక్! అఖిల భార‌త సర్వీసుల నుంచి పూజా ఖేద్క‌ర్ తొల‌గింపు, వెంట‌నే అమల్లోకి ఉత్త‌ర్వులు

తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (IAS) నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

Puja Khedkar's Provisional Candidature Cancelled by UPSC, Controversial IAS Trainee Banned From Appearing in Future Exams

New Delhi, SEP 07: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar Dismissed) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (IAS) నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్‌ రూల్స్‌ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా పుణెలో ఐఏఎస్‌ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై (Puja Khedkar) ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్‌ సమయంలో అధికారిక ఐఏఎస్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్‌ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.

Here's Tweet

 

సివిల్‌ సర్వీసెస్‌కు (Civil Services) ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.

Cyber Fraud: ఏకంగా ఎస్పీ పేరుతోనే టోకరా, మీటింగ్‌లో ఉన్నా డబ్బులు కావాలని వాట్సాప్ మెసేజ్, నేపాల్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తింపు 

నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ (UPSC) దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్