Firecracker Factory Blast: పంజాబ్‌లో విషాద ఘటన! పటాకుల కార్మాగారంలో భారీ పేలుడు, 19 మంది దుర్మరణం. పేలుడు తర్వాత భారీగా ఎగిసిపడిన మంటలు.

ఆ కార్యక్రమం కోసం బాణాసంచా తయారు చేస్తుండగా దురదృష్టవషాత్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు...

Representational Image (Photo Credits: IANS)

Gurdaspur, September 04: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారం (Firecracker factory)లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. నివేదికల ప్రకారం, జిల్లాలోని బటాలా పట్టణంలో ఉన్న ఈ కర్మాగారంలో మరో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. పేలుడు ధాటికి బాణాసంచా కార్మాగారం బూడిదవగా, సమీప భవనాలు కూడా ధ్వంసం అయినట్లు తెలియవచ్చింది.

సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. జిల్లా అధికారులు, NDRF, SDRF బృందాలు పేలుడు జరిగిన ప్రదేశానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటన స్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు.

సెప్టెంబర్ 5న తలపెట్టిన గురు నానక్ దేవ్ (Gurunanak Dev)వివాహ వార్షికోత్సవ వేడుకలలో ఈ బాణసంచాను ఉపయోగించాల్సి ఉంది. ఆ కార్యక్రమం కోసం బాణాసంచా తయారు చేస్తుండగా దురదృష్టవషాత్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఘటన జరిగిన ప్రదేశంలో పరిస్థితి

 

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ (Amarinder Singh )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్