Bulking 'Quarantine' Meal in AP: కరోనావైరస్ రోగ నిరోధక శక్తికి 'జగనన్న గోరుముద్ద', విజయవాడలోని క్వారైంటైన్ కేంద్రంలో డ్రై ఫ్రూట్స్ మరియు గుడ్లతో పౌష్టికాహారం, రాష్ట్రవ్యాప్తంగా ఇదే మెనూ అమలు పరచాలని ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్రంలోని విజయవాడ, గన్నవరం తదితర క్వారైంటైన్ కేంద్రాలలో 'జగనన్న గోరుముద్ధ' పథకం కింద అందించే ఆహారంలో జీడిపప్పు, బాదాం, ఖర్జూరం, గుడ్లు, అరటిపండ్లు శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన 'ఆరోగ్య ఆంధ్ర' విభాగం తెలిపింది......
Amaravathi, April 9: ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి (COVID-19 in Andhra Pradesh) కట్టడి కోసం సీఎం వైఎస్ జగన్ (CM Jagan) నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తూ లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరిని క్వారైంటైన్ కేంద్రాలకు తరలించి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు క్వారైంటైన్ కేంద్రాలలో ఉన్న వారికి సైతం రోగ నిరోధక శక్తి పెంచేలా బలవర్ధకమైన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ రకంగా రాష్ట్రంలో కరోనావైరస్ నియంత్రణ కోసం తమదైన వ్యూహాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తుంది.
రాష్ట్రంలోని విజయవాడ, గన్నవరం తదితర క్వారైంటైన్ కేంద్రాలలో (Quarantine Centers) 'జగనన్న గోరుముద్ధ' పథకం కింద అందించే ఆహారంలో (Goru Mudda Menu) జీడిపప్పు, బాదాం, ఖర్జూరం, గుడ్లు, అరటిపండ్లు, బత్తాయి పండ్లు ఉన్నటువంటి శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన 'ఆరోగ్య ఆంధ్ర' విభాగం తెలిపింది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ప్రజలు కరోనావైరస్ ను తట్టుకునేలా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్వారైంటైన్ కేంద్రాలలో ఇదే మెనూని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు, జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాల కోసం క్లిక్ చేయండి
Here's 'Arogya Andhra' tweet:
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కూడా ఏపీలో ఒక్క కోవిడ్19 కూడా నమోదు కాలేదు. అయితే మధ్యాహ్నం తర్వాత తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక పాజిటివ్ కేసు నిర్ధారించబడింది. దీంతో ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 12 కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే నేడు తక్కువే ఉంది. తాజా కేసుతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 349కి చేరింది. రోజు గడిచే కొద్ది ఇంకా ఎన్నికేసులు నిర్ధారణ అవుతాయో తేలాల్సి ఉంది. రోజుకు కనీసం 1000 సాంపుల్స్ పరీక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.