Raghu Rama Krishna Raju Harassment Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

Raghu Rama Krishna Raju Harassment Case: Court Orders 14-Day Custody for CID Retired ASP Vijay Paul

Vjy, Nov 27: ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దీని వెనుక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో, న్యాయస్థానం విజయపాల్ కు రెండు వారాల రిమాండ్ విధించింది.

గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో వచ్చారని ప్రాసిక్యూషన్‌ జాయింట్‌ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.‘‘ రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆయన్ను చంపడానికి ప్రయత్నించారు. తనపై దాడి విషయాన్ని రఘురామ కోర్టులో చెప్పారు. తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్‌ వైద్యులూ నిందితులే.

ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని విచారించాం. నాడు విచారణ సందర్భంగా ఉన్నవారినీ విచారించాం. రఘురామపై దాడి జరిగినట్టు నిర్ధరణకు వచ్చాం. ఆయనను వేధించిన విషయం వీడియో తీసి అప్పటి పెద్దలకు పంపించారు. వారు ఎవరనేది త్వరలో తేలుతుంది’’ అని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Manda Krishna Madiga: 7న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా, వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారని ఫైర్, దామోదర రాజీనామా చేయాలని డిమాండ్

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..

KP Chowdary Dies by Suicide: ఆర్థిక ఇబ్బందులా లేక డ్రగ్స్‌ కేసులో నిందితుడనే అవమానమా, ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య, గోవాలో ఇంట్లో విగతజీవిగా కనిపించిన సుంకర కృష్ణప్రసాద్‌ చౌదరి

Share Now