Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం, రాహుల్ గాంధీని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు, జనగణమణకు బదులు నేపాల్ జాతీయ గీతం పాడిన కాంగ్రెస్ నేతలు, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!
వెళ్లిన ప్రతీ రాష్ట్రంలో ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ ఏర్పాటు చేసిన సభ సందర్భంగా ఓ తప్పిదం చోటు చేసుకుంది.
Mumbai, NOV 17: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఫుల్ జోష్ తో నడుస్తోంది. వెళ్లిన ప్రతీ రాష్ట్రంలో ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ ఏర్పాటు చేసిన సభ సందర్భంగా ఓ తప్పిదం చోటు చేసుకుంది. దీంతో ఆయన్ను బీజేపీ నేతలతో పాటూ నెటిజన్లు (Netizens) తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ...రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సాయంత్రం పూట ఓ చోట ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం జాతీయ గీతంతో (national anthem) సభను ముగించాలని ఆయన సూచించారు. ఇప్పుడు రాష్ట్రీయ గీతం అంటూ రాహుల్ (Rahul Gandhi) అనౌన్స్ చేశారు. అయితే జాతీయ గీతం జనగణమణకు బదులుగా నేపాల్ జాతీయ గీతం ప్లే (Nepal’s national anthem) చేశారు నిర్వాహకులు దీంత అందరూ ఖంగుతిన్నారు. దాదాపు పది సెకెన్ల పాటూ నేపాల్ జాతీయ గీతం ప్లే అయింది.
రాహుల్ గాంధీ వెనుకున్న ఓ నేత వెంటనే అలర్ట్ చేయడంతో....వెంటనే జనగణమణను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. దీనిపై నెటిజన్లు, బీజేపీ (BJP) నేతలు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. భారత జాతీయగీతం కూడా తెలియని రాహుల్ గాంధీ....భారత్ కు ప్రధాని ఎలా అవుతారంటూ పలువురు బీజేపీ సానుభూతిపరులు కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ ప్రధాని కావాలంటే మరో వందేళ్లయినా పడుతుందని ట్వీట్లు చేస్తున్నారు.\
అయితే మరికొందరు ఫన్నీగా కూడా కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Gandhi’s Bharat Jodo Yatra) చేస్తున్నాడు కాబట్టి అఖండ భారత్ ను కలపడమే ధ్యేయంగా పని చేస్తున్నారు కావొచ్చు. అందుకే అఖండ భారత్ లో భాగమైన నేపాల్ జాతీయ గీతాన్ని ప్లే చేశారంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.
అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో కర్ణాటకలో కూడా కేజీఎఫ్-2 సాంగ్ విషయంలో చిక్కుల్లో పడింది. కేజీఎఫ్-2 సాంగ్ ను వాడినందుకు నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే వీటన్నింటినీ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోందని చెప్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.