Raj Tarun Gets Anticipatory Bail: రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది

Lavanya filed a police complaint against hero Raj Tarun

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లావ‌ణ్య కేసులో హైకోర్టును ఆశ్ర‌యించిన హీరో రాజ్ త‌రుణ్, విచార‌ణ రేప‌టికి వాయిదా

తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్‌ ల్యాబ్‌ వద్ద హల్‌చల్‌ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా..  రాజ్‌ తరుణ్‌ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. వారం గ్యాప్‌లో వ‌చ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్‌గా నిలిచాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif