Rajasthan: బాలిక కిడ్నాప్.. తొమ్మిది రోజుల పాటు దారుణంగా అత్యాచారం, ఈ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా

ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష (13 People Jailed for 20 Years), మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది

Representational Image. | (Photo Credits: Pixabay)

Kota, Dec 20: ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష (13 People Jailed for 20 Years), మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు నాయకత్వం వహిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి అశోక్ చౌదరి, బాలికను ఇక్కడ తన ఇంటి నుంచి అపహరించి, ఝలావర్‌కు తీసుకెళ్లి అత్యాచారం (Gang-Raping 15-Year-Old Girl) చేసినందుకు, అలాగే పలువురికి విక్రయించినందుకు ఒక మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

16 మందికి శిక్ష విధించగా, నేరంలో ప్రమేయం ఉన్న మరో 12 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నలుగురు తక్కువ వయస్సు గల నేరస్థులు ఇప్పటికీ స్థానిక జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా ఈ ఏడాది మార్చి 6న కోటా జిల్లాలోని సుకేత్‌ పోలీస్‌ స్టేషన్‌లో 15 ఏండ్ల బాలిక అత్యాచారం కేసు నమోదయింది. పూజా జైన్‌ అనే మహిళ.. ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి, ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝలావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజులపాటు వారు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

అందంగా ఉన్నాడనుకుని తన ప్రైవేట్ ఫోటోలను పంపింది, కట్ చేస్తే అతని అసలు రంగు బయటపడింది. తమిళనాడులో మోసపోయి పోలీసులను ఆశ్రయించిన మహిళ

ఈ కేసులో మొత్తంగా 16 మందికి కోర్టు శిక్ష విధించింది. మరో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాలికను విక్రయించిన మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 20 ఏండ్లు జైలుశిక్ష పడిన ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. నాలుగేళ్లు శిక్ష పడిన వారు రూ.7 వేలు కట్టాలని ఆదేశించింది.

రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ విచారణ జరిపిన తర్వాత నేరం జరిగిన తొమ్మిది నెలలలోపు కోర్టు తీర్పును వెలువరించింది. కేసు విచారణను పూర్తి చేసిన తర్వాత, కోట పోలీసులు మే 7న కోర్టుకు 1750 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు,ఈ కేసులో వేగంగా విచారణను నిర్వహించి, శనివారం తన తీర్పును వెలువరించిందని ప్రాసిక్యూషన్ న్యాయవాది ప్రేమ్ నారాయణ్ నామ్‌దేవ్ చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif