Bundi Bus Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం, 24 మంది మృతి, బుండి కోట వద్ద నదిలోకి దూసుకెళ్లిన బస్సు
ఓ బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది ప్రయాణికులు మృతి చెందారు. రాజస్థాన్ లోని కోట జిల్లాలోని లాల్సుత్ మెగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బుండి కోట (Bundi Bus Accident)లాల్‌సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. వీరంతా పెళ్లికి వెళుతున్న సమయంలో ( Marriage party) ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Bundi,Febuary 26: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం (Rajasthan Bus Accident) చోటు చేసుకుంది. ఓ బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది ప్రయాణికులు మృతి చెందారు. రాజస్థాన్ లోని కోట జిల్లాలోని లాల్సుత్ మెగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
బుండి కోట (Bundi Bus Accident)లాల్‌సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. వీరంతా పెళ్లికి వెళుతున్న సమయంలో ( Marriage party) ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు మృతి (24 feared dead) చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఎంతమంది అందులో ప్రయాణిస్తున్నరనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నారు. ఘటనాస్థలి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
కొండను ఢీకొట్టిన టూరిస్టు బస్, 11 మంది దుర్మరణం
మరోవైపు బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియరావడం లేదు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా..? లేక నిద్ర మత్తులో ఉన్నాడా..? లేదా బస్సు వంతెనపైకి రాగానే ఏదైనా వాహనం అడ్డువచ్చిందా ..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు బస్సును నీటిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు నదిలో బోర్లా పడిపోవడంతో అందరూ చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.