Rajasthan: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన న్యాయమూర్తి, ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని తల్లి కొడుకులిద్దరికీ బెదిరింపులు, రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలతో నిందితుడిపై సస్పెన్సన్ ఉత్తర్వులు
రాష్ట్రంలో భరత్ పూర్ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి (Raping 14-Year-Old Boy) పాల్పడ్డాడు. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితో పాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కొడుకుని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Bharatpur, November 1: రాజస్థాన్ రాష్ట్రంలో హేయమైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో భరత్ పూర్ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి (Raping 14-Year-Old Boy) పాల్పడ్డాడు. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితో పాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కొడుకుని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని జడ్జి బెదిరించారని వితంతురాలైన బాధితుడి తల్లి ఆరోపించింది. కలకలం రేపిన ఈ ఘటనలో (Rape of Minor Boy) రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలతో జడ్జిపై తక్షణం సస్పెన్సన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేసులో బాలుడిని బెదింరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర లాల్ యాదవ్ కూడా సస్పెండ్ అయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం..ఏడో తరగతి చదువుతున్న ఆమె కుమారుడు రోజు ఆటలాడుకునేందుకు భరత్ పూర్ మైదానానికి వెళ్లేవాడు. స్పెషల్ జడ్జి జితేంద్ర, ఆయన సహాయకులు కూడా వ్యాయామం చేయడానికి అక్కడకు వచ్చేవారు. అక్కడే వారు తమ బాలుడిని పిలిచి లైంగికంగా వేధింపులకు ( Rape in Bharatpur) గురి చేశారు.
బాలుడిని ఇంటికి తీసుకువెళ్లి మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చేవారు. చిన్నారి స్పృహ కోల్పోగానే నగ్నంగా తయారు చేసి అసభ్యంగా పాల్పడేవారని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు మథుర గేట్ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు ( Special Judge, 2 Others Booked) చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు సమయంలో పిల్లల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గంగారామ్ బాధితులతో ఉన్నారు.