Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు, దోషి ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఆదేశాలు

ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ విడుదల చేయాలని జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర రావు, బీఆర్ గ‌వాయి, ఏఎస్ బోపన్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం బుధవారం ఉత్తర్వులు జారీ (Supreme Court Orders Release of Convict AG Perarivalan) చేసింది.

AG Perarivalan (Photo Credits: Twitter)

New Delhi, May 18: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi Assassination Case) సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ విడుదల చేయాలని జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర రావు, బీఆర్ గ‌వాయి, ఏఎస్ బోపన్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం బుధవారం ఉత్తర్వులు జారీ (Supreme Court Orders Release of Convict AG Perarivalan) చేసింది. తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీక‌రించింద‌ని, ఇక ఆర్టిక‌ల్ 142 ప్ర‌కారం పేరరివాళన్‌ను విడుదల చేయ‌డం స‌మంజ‌స‌మే అని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది

కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో పేరరివాళన్‌తో పాటు దోషులుగా తేలిన మురుగన్‌, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

జ్ఞానవాపి మసీదు సర్వేలో కీలక మలుపు, అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రాపై వేటు, ఆయన స్థానంలో కొత్త అడ్వొకేట్‌ కమిషనర్‌గా విశాల్‌ సింగ్‌

ఇటీవల పేరరివాళన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదల అనంతరం పెరారివాలన్‌ కుటుంబ సభ్యులను కలిశాడు. సుమారు 30 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని చేరుకున్న పెరారివాలన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి అతను విడుదలైన సంగతి తెలిసిందే.