Advocate commissioner Ajay Mishra (Photo-ANI)

New Delhi, May 17: ఉత్తర ప్రదేశ్‌ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో (Gyanvapi Case) ఉద్వాసనకు గురైన అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అన్నారు.నేనేం తప్పు చేయలేదు. విశాల్‌ సింగ్‌ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది. అర్ధరాత్రి 12 దాకా మేం నివేదికను రూపొందించాం. విశాల్‌ చేసే కుట్రను కనిపెట్టలేకపోయా. చాలా బాధగా అనిపించింది. సర్వే గురించి ఎలాంటి సమాచారం నేను బయటపెట్టలేదని అడ్వొకేట్‌ అజయ్‌ మిశ్రా (Advocate Commissioner Ajay Mishra) పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. కమిటీ సర్వే కొనసాగుతున్న టైంలోనే లీకులు అందించారంటూ వారణాసి కోర్టు మంగళవారం అర్ధాంతరంగా అజయ్‌ మిశ్రాను తప్పించి.. ఆ స్థానంలో విశాల్‌ సింగ్‌ను కొత్త అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. అజయ్‌ మిశ్రా మీద ఫిర్యాదు చేసిందే విశాల్‌ సింగ్‌ కావడం విశేషం. అజయ్‌ మిశ్రా ప్రవర్తన మీద పిటిషన్‌ దాఖలు చేశా. ఆయన ఓ వీడియోగ్రాఫర్‌ నియమించుకుని.. అతనితో మీడియాకు లీకులు ఇచ్చారు. పుకార్లు ప్రచారం చేశారు. నేను నా బాధ్యతగా నా నివేదిక సమర్పించానని పేర్కొన్నారు విశాల్‌ సింగ్‌.

జ్ఞాన్‌వాపి మ‌సీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు, తదుపరి విచారణను మే 19కి వాయిదా

వీడియోగ్రాఫర్‌ చేసిన తప్పిదానికి తానేం చేయగలనుంటున్నాడు అజయ్‌ మిశ్రా. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందని హిందూ వర్గం, కాదు.. అది కొలనుకు సంబంధించిన భాగం అని మసీద్‌ నిర్వాహక కమిటీ వాదిస్తున్నారు. ఇక సర్వే కమిటీ మరో రెండురోజుల్లో వారణాసి కోర్టులో తన నివేదికను సమర్పించనుంది. సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్న వేళ మూడు రోజులపాటు అడ్వొకేట్‌ కమిటీ నేతృత్వంలో మసీదు ప్రాంగణంలో వీడియోగ్రాఫిక్‌ సర్వే జరిగిన సంగతి తెలిసిందే.