Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన నమో, నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన పూర్తి సమాచారం లోపల కథనంలో..
అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Bhumi Pujan) విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయిని (PM Narendra Modi Lays Foundation Stone) వేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.
Ayodhya, August 5: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Bhumi Pujan) విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయిని (PM Narendra Modi Lays Foundation Stone) వేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పారిజాత మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని పక్కన ఉన్నారు.
ముందుగా రామ్‌లల్లా ఆలయానికి చేరుకున్న మోదీ తొలుత సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడికి పువ్వులతో పూజ సమర్పించారు. రామాలయ నిర్మాణం సందర్భంగా భూమిపూజలో పాల్గొనేందుకు మోదీ అయోధ్యకు చేరుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్‌లల్లా విగ్రహమూర్తి చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు.
PM Narendra Modi Lays Foundation Stone For Ram Mandir in Ayodhya:
ప్రధానితో పాటు మొత్తం 17 మంది స్టేజ్‌పై పూజలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా భూమిపూజలో పాల్గొన్నారు. మోదీ రాకకు పూర్వమే భూమిపూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పండితులు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేశుడు పూజ చేశారు. భూమి పూజ కోసం తొమ్మిది శిలలను వాడారు. జల, పుష్పాలతో మోదీ పూజించారు. మోదీ చేత సంకల్పం చదివించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పూజలో పాల్గొన్నారు. మోదీ పేరిట పండితులు పూజ నిర్వహించారు.
Update by ANI
అయోధ్యకు చేరగానే ప్రధాని ముందుగా హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ప్రేమ్‌దాస్ మహరాజ్ ప్రధానికి తలపాగా, వెండి కిరీటం బహూకరించారు. అనంతరం ప్రధాని రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే ప్రదేశానికి వెళ్లారు.
భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులంతా ఉదయాన్నే అయోధ్యకు చేరుకున్నారు. ఈ భూమిపూజ నేపథ్యంలో అయోధ్యలో పండుగవాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రామనామ స్మరణతో అయోధ్యానగరం మార్మోగుతున్నది. ప్రధాని పర్యటన, భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రముఖులంతా భౌతికదూరం పాటిస్తూనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సుప్రసిద్ధ హనుమన్ ఆలయానికి ఆయన వెళ్లారు.
అయోధ్యలో రామ ఆలయం భూమిపూజ సందర్భంగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని బుధవారం రంగోళీలతో తీర్చిదిద్దారు. ప్రతిపాదిత ఆలయం నమూనాను ప్రధాన కార్యాలయంలో కళాకారులు తీర్చిదిద్దారు. అలాగే ‘జై శ్రీరామ్’ నినాదాన్ని చిత్రించారు. అలాగే గుజరాత్ గాంధీనగర్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా రామ ఆలయ నమూనాను రంగులు, పూలతో అందంగా తీర్చిదిద్దారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)