Ram Mandir Construction: అయోధ్యలో టైమ్ క్యాప్సూల్ అంతా అబద్దం, ఎవ్వరూ నమ్మవద్దు, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసిన అధికారిక ప్రకటన మాత్రమే సరైనదని తెలిపిన ట్రస్ట్

అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) కింద భూమిలో 2000 అడుగుల లోతున ఓ టైమ్‌ క్యాప్సూల్‌‌ను (Time Capsule) ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.. ఇందులో అయోధ్య ప్రత్యేకత, చరిత్రకు సంబంధించిన కీలక వివరాలను పొందుపరచనున్నట్లు రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ (Kameshwar Chaupal) చెప్పారు. భూగర్భంలో నిక్షిప్తం చేసే ముందు టైమ్ క్యాప్సూల్‌ను ఓ రాగి రేకు లోపల భద్రపరుస్తారని ఆయన తెలిపారు.

Champat Rai, General Secretary of Sri Ram Janmabhoomi Teertha Kshetra Trust (Photo Credits: ANI)

Ayodhya, July 28: అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) కింద భూమిలో 2000 అడుగుల లోతున ఓ టైమ్‌ క్యాప్సూల్‌‌ను (Time Capsule) ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.. ఇందులో అయోధ్య ప్రత్యేకత, చరిత్రకు సంబంధించిన కీలక వివరాలను పొందుపరచనున్నట్లు రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ (Kameshwar Chaupal) చెప్పారు. భూగర్భంలో నిక్షిప్తం చేసే ముందు టైమ్ క్యాప్సూల్‌ను ఓ రాగి రేకు లోపల భద్రపరుస్తారని ఆయన తెలిపారు. మహారాష్ట్రను టార్గెట్ చేసిన బీజేపీ, శివసేన ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపిన చంద్రకాంత్‌ దాదా పాటిల్‌, వ్యూహాలను సిద్ధం చేయాలని నడ్డా సూచన

రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ టైమ్ క్యాప్సూల్ ఉపయోగపడుతుందన్నారు. బీహార్‌కు చెందిన కామేశ్వర్ చౌపాల్ 1989 నవంబర్ 9 న అయోధ్యలోని రామ్ ఆలయానికి పునాదిరాయి వేశారు.

Here's Shri Ram Janmbhoomi Teerth Kshetra Statement

అయితే ఈ వార్తలను శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారు. "ఈ నివేదికలు అబద్ధం" అని రాయ్ అన్నారు. రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Ram Janmabhoomi Teertha Kshetra Trust)

జారీ చేసిన అధికారిక ప్రకటన మాత్రమే సరైన సమాచారం అని నిర్ధారించాలని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రజలను కోరారు. ఆలయానికి సంబంధించి అనధికారికంగా వెలువడే ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దని, అడుగు భాగంలో ఎలాంటి టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేయబోవడంలేదని రాయ్ (Champat Rai) కుండబద్దలు కొట్టారు. భూమి పూజకు 250 మంది అతిథుల‌ు, ప్రధాని మోదీని ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, ఆగ‌స్టు 5న అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమం

కాగా మందిరం అడుగు భాగంలో టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేస్తామన్న ట్రస్టు సభ్యుడి ప్రకటన నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. దేశంలోని చిన్నా, పెద్దా మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ వార్తలు విపరీతంగా షేర్ అయ్యాయి. అసలు ఈవెంట్ కంటే టైమ్ క్యాప్సుల్ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్లారిటీ ఇచ్చింది.

ఆగస్టు 5న అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజలో ముంస్లింలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫయాజ్‌ ఖాన్‌ కాలినడకన అయోధ్యకు బయలుదేరి పతాక శీర్శికలకు ఎక్కాడు. ఆలయ నిర్మాణానికి ఇటుకలను కూడా ఆయన మోసుకెళుతున్నారు. ఫయాజ్‌ లాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు అయోధ్యకు పయనమయ్యారు. వాళ్లలో రాజా రయీస్‌, వాసీ హైదర్‌, హజీ సయీద్‌, జంషెడ్‌ ఖాన్‌, ఆజం ఖాన్‌ తదితరులున్నారు. తాము రాముడిని ‘ఇమామ్‌-ఎ-హింద్‌'గా భావిస్తామని వారంతా అంటున్నారు.

దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మించబోయే భవ్య రామ మందిరం కొత్త డిజైన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ నెల 18న ఆమోదం తెలిపింది. 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈలయానికి అదనంగా మూడు మంటపాలనూ ఏర్పాటు చేస్తామని, మొత్తం 366 స్తంభాలను వాడుతామని ప్రధాన శిల్పి సీఎస్‌ సోంపూరా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా, ఆగస్టు 5న అయోధ్య భూమి పూజ జరుగనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now