Ayodhya, July 20: వచ్చే నెల 5వ తేదీన అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీరాముని మందిర నిర్మాణం భూమి పూజకు (Ayodhya Bhoomi Poojan) శ్రీరామభజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ఆహ్వానాలను పంపుతోంది. భూమి పూజ కార్యక్రమానికి (Ram Temple Construction) సుమారు 250 మంది అతిథులను పిలవనున్నట్లు అనధికార సమాచారం. అయోధ్యలోని ప్రముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు ఈ ఆహ్వాన లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Narendra Modi) ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం అందింది. అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
అలాగే కొందరు కేంద్ర మంత్రులను, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులను కూడా భూమి పూజ కోసం ఆహ్వానించనున్నారు. కాగా రామ మందిరానికి జూన్ 10వ తేదీనే పునాదులు వేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఆగస్టు 5న నిర్వహించనున్న ఈ భూమి పూజ కార్యక్రమం కాశీ, వారణాసి నుంచి వచ్చే ప్రముఖ పూజారుల సమక్షంలో జరగనుంది. రెండేళ్లలో రామమందిరం పూర్తి
ఆగస్టు 5వతేదీన 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ భూమిపూజ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని కాశీ దేవాలయం నుంచి కొందరు పూజారులు రామాలయం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Ram Janmabhoomi Teertha Kshetra Trust) జూలై 18న సమావేశం అయ్యింది. అయితే రామాలయ నిర్మాణానికి సంబంధించి తేదీలను ఆగస్టు 5కు ఖరారు చేశారు.దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. డిజైన్ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.