New Delhi, February 5: అయోధ్యలో రామమందిర నిర్మాణం (Ayodhya Ram Temple) దిశగా మరో అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను (Shri Ram Janmabhoomi Teerth Kshetra) కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు.
అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం
ఈ మేరకు బుధవారం ఆయన సభలో (Lok Sabha) మాట్లాడుతూ... ‘‘నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్టు (Ayodhya Trust) ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం.
అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా (Sri Ram Janmabhoomi Tirth Kshetra) నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది’’అని స్పష్టం చేశారు. అదే విధంగా.. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను ట్రస్ట్ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రామమందిర ప్రాంతం కోసం 67 హెక్టార్ల భూమిని ట్రస్ట్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. రామమందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 5 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని వెల్లడించారు.
Watch PM Modi's Statement:
WATCH: PM Modi speaking in Lok Sabha on Ram temple https://t.co/g1wnBrOXt2
— ANI (@ANI) February 5, 2020
రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారని ప్రధాని అన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
కాగా దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది.
30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్
అక్కడ మందిర నిర్మాణానికి వీలుగా మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రస్ట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగా... ఇందుకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని మోడీ అధికారిక ప్రకటన చేశారు.
అయోధ్యలో రామ మందిర్ న్యాస్ డిజైన్
ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగమైన రామ మందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ చారిత్రాత్మక తీర్పును భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన విషయం తెలిసిందే.
రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని ఎప్పుడో కోరాం
అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. భారత్ లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బుద్ధులు, పార్శీ, జైన్.. ఇలా అందరూ ఒకే కుటుంబమని చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగాల్సిందేనని చెప్పారు. ప్రతి పౌరుడి ఆనందం కోసం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.