Ayodhya, November 9: దశాబ్దాల రామన్మభూమి వివాదానికి తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు(Ayodhya case Final Judgment)ను ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి (Ram Mandir In Ayodhya) మార్గం సుగమమైంది. కాగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం (Muslims to get alternate land) కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్‌కే (Hindus to get disputed land) అప్పగించింది. అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి
వివాదాస్పద అయోధ్య కేసు( Ayodhya Case)లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పును చదివివినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది.
చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని, మసీదు కింద భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదిక వెల్లడించిందని చెబుతూ బాబ్రీమసీదును కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ఆధారాలు లేవని అన్నారు.
12 నుంచి 16వ శతాబ్ధాల మధ్య ఏం జరిగిందనడానికి ఆధారాలు లేవని, మసీదును ముస్లింలు ఎప్పుడు వదలివేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేమని పేర్కొన్నారు. అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించలేమని అన్నారు.
వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. పురావస్తు నివేదికలనూ మదింపు చేసి తీర్పును వెల్లడించామన్నారు. జస్టిస్ గగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.