Ram Temple In Ayodhya: రెండేళ్లలో రామమందిరం పూర్తి, ఈ నెల 18న తొలిసారిగా భేటీకానున్న ఆలయ కమిటీ, రామ్ మందిర్ సన్నాహాలపై చర్చించే అవకాశం, వెల్లడించిన రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్‌ చౌపాల్‌
Ram Temple to be ready by 2022, says trustee Kameshwar Chaupal (Photo_twitter)

Ayodhya, Febuary 10: మరో రెండేళ్లలో అయోధ్యలో (Ayodhya) రామాలయం పూజలు అందుకోనుంది. 2022 నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం (Ram Temple) పూర్తవుతుందని శ్రీ రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్‌ చౌపాల్‌ (Kameshwar Chaupal) పేర్కొన్నారు. మందిర నిర్మాణ సన్నాహాలపై చర్చించేందుకు ఆలయ కమిటీ తొలిసారిగా ఈనెల 18న ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశంలో మందిర నిర్మాణాన్ని ఎప్పటినుంచి ప్రారంభించే విషయాన్ని ఖరారు చేయనున్నారు.  30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్

ముందుగా రామ మందిర నిర్మాణానికి కేటాయించిన 67 ఎకరాల స్థలాన్ని చదునుచేసి ఆపై శంకుస్ధాపన కార్యక్రమం చేపడతామని, మందిర నిర్మాణం పవిత్రమైన రోజున ప్రారంభిస్తామని చౌపాల్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర శంకుస్ధాపనకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా మందిర నిర్మాణానికి 67 ఎకరాల భూమి సరిపోదని, మరింత భూమి అవసరమని అన్నారు.

ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభలో ప్రకటన చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు (Supreme Court judgement) కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను (Shri Ram Janmabhoomi Teerth Kshetra) కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు.