IPL Auction 2025 Live

Ayodhya Ram Temple Event: అయోధ్యలో కరోనా పంజా, పూజారితో సహా 16 మంది పోలీసుల‌కు కోవిడ్-19 పాజిటివ్, అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలు అమలు

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం (Ayodhya Ram Temple) కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ (Priest, 16 Cops Test Positive) వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

Coronavirus Positive. (Photo Credits: IANS|Representational Image)

Ayodhya, July 30: అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కోసం (Ram Temple Foundation Stone Laying Ceremony) దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో షాకింగ్ లాంటి వార్త బయటకు వచ్చింది. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం (Ayodhya Ram Temple) కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ (Priest, 16 Cops Test Positive) వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. కరోనా కేసుల్లో భారీ ఊరట, దేశంలో 10 లక్షల మంది డిశ్చార్జ్, భారీ స్థాయిలో పెరిగిన రికవరీ రేటు, వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

అయోధ్య భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని న‌లుగురు పూజాలు నిర్వ‌హించ‌నున్నారు. దాంట్లో పూజారి ప్ర‌దీప్ దాస్ ఒక‌రు. ఇప్పుడు పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారినపడ్డారు. దీంతో వారంతా క్వారంటైన్ లోకి వెళ్లారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) భూమిపూజ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. మోదీతో పాటు 50 మంది వీఐపీలు ఈ ఈవెంట్‌కు హాజ‌రుకానున్నారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. అయోధ్య న‌గ‌రంలో (Ayodhya) భారీ సీసీటీవీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని లైవ్‌లో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి మేర ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అయోధ్య సమాచార డిప్యూటీ డైరెక్టర్‌ ధార్‌ సింగ్‌ తెలిపారు. 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు

ఆచార్య స‌త్యేంద్ర దాస్ శిశ్యుడే ప్ర‌దీప్ దాస్‌. ప్ర‌స్తుతం స‌త్యేంద్ర దాస్ హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జ‌రుగుతున్న‌ది. బుధ‌వారం దాస్‌ను ఇంట‌ర్వ్యూ చేసిన కొంద‌రు మీడియా వ్య‌క్తులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. యూపీ ఆరోగ్య‌శాఖ నివేదిక ప్ర‌కారం.. అయోధ్య‌లో బుధ‌వారం 66 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆ న‌గ‌రంలో నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 605 మంది హాస్పిట‌ళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయోధ్య జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు.. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.