Coronavirus Recoveries in India (Photo Credits: PTI)

New Delhi, July 30: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ అంతే భారీ స్థాయిలో క‌రోనా బాధితుల రిక‌వరీ రేటు (COVID-19 Recovery Rate) పెరుగుతోంద‌ని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15 ల‌క్ష‌లు దాట‌గా ఇందులో 10 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. క‌రోనాతో (Coronavirus) పోరాడుతున్న 5 ల‌క్ష‌ల‌మంది కంటే దాని నుంచి కోలుకున్న‌వారి సంఖ్య రెట్టింపు కావ‌డం విశేషం. 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు

అలాగే ప్ర‌తివారం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచుకుంటూ పోతున్నామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి 10 ల‌క్ష‌ల మందిలో 324 మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు కోటి 82 ల‌క్ష‌ల శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు తెలిపింది. మ‌రోవైపు కోవిడ్‌ను నివారించేందుకు ప‌రీక్షిస్తున్న‌ 14 వ్యాక్సిన్లు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నాయని పేర్కొంది.

భారత్‌లో గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Cases in India) నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు (Coronavirus Deaths in India) పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఈనెల 29 వరకు 1,81,90,382 కోవిడ్‌-19 శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 4,46,642 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది.