Ram Temple In Ayodhya: అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం, నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తాం, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
చారిత్రాత్మక తీర్పు ( Ayodhya verdict) వచ్చిన తర్వాత అందరిలోనూ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం (Ram Temple In Ayodhya) ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
Ayodhya, December 16: దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే తెరదించిన సంగతి తెలిసిందే. చారిత్రాత్మక తీర్పు ( Ayodhya verdict) వచ్చిన తర్వాత అందరిలోనూ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం (Ram Temple In Ayodhya) ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు.ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ..4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించిందని.. త్వరలోనే అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు.
Here's Tweet
కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినా అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. మరో నాలుగు నెలల్లోనే నిర్మాణం ప్రారంభమవుతుందని, అయోధ్యలో ఆకాశమంత ఎత్తున రామాలయం నిర్మితమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో మహత్తరమైన ఆలయం నిర్మించాలని ప్రజలు గత వందేళ్లుగా డిమాండ్ చేస్తున్నారని, సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు వెలువరించిందని అమిత్ షా తెలిపారు.
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. రివ్యూ పిటిషన్లకు సరైన ప్రాతిపదిక లేదని, రివ్యూ పిటిషన్లన్నింటినీ పరిశీలించిన తర్వాత వీటిని కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.