Gujarat: కామాంధుడికి యావజ్జీవ శిక్ష, కోపంతో జడ్జిపై చెప్పులు విసిరేసిన దోషి, ఒక్కసారిగా షాక్ తిన్న న్యాయమూర్తి, హజిరా బాలిక హత్యాచారం కేసులో నిందితుడు సుజిత్‌ సాకేత్‌ జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ తీర్పు

నిందితుడు సుజిత్‌ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్‌ జిల్లా(గుజరాత్‌) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.

Court Judgment, representational image | File Photo

Surat, Dec 30: గుజరాత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. నిందితుడు సుజిత్‌ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్‌ జిల్లా(గుజరాత్‌) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.

జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్‌ సాకేత్‌ కోపంతో తన కాలి చెప్పులను తీసి (Rape, murder convict hurls shoe) జడ్జి పీఎస్‌ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడకుండా (Rape convict hurls shoe at Gujarat judge) ఆయన ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడున్న పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. కాగా జడ్జి పీఎస్‌ కళ (court of special POCSO judge PS Kala) గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించారు.

విద్యార్థితో ప్రేమలో పడిన టీచర్, ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఓ ఇంట్లో కాపురం, మైనర్ కుమారుడిని ప్రలోభపెట్టి ఆ మహిళ పెళ్లి చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తండ్రి

హజిరా ఉదంతంలో బాధితురాలు వలస కార్మికుడి కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలిక. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్‌ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే నివాసం ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న చాక్లెట్‌ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆపై బాలికను హతమార్చాడు.ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో కేసును ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు.

ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.