Ratan Tata Last Rites: ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌

అంత్యక్రియల తర్వాత, దక్షిణ ముంబైలోని కొలాబాలోని రతన్ టాటా బంగ్లాలో మరో మూడు రోజుల పాటు సంప్రదాయ ఆచారాలను నిర్వహించనున్నారు.

Ratan Tata (Photo Credits: File Image)

Mumbai, OCT 10: టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది (Worli crematorium). కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. రతన్‌ టాటా (Ratan Tata Last Rites) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ముంబైలోని నారిమన్‌ పాయింట్లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (NCPA) ఉంచారు.

People From All Walks of Life Join Ratan Tata's Final Journey

 

సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు రతన్‌ టాటాకు కడసారి నివాళులర్పించారు. సాయంత్రం 4 గంటలకు రతన్‌ టాటా భౌతిక కాయాన్ని ఎన్‌సీపీఏ నుంచి అంతిమ యాత్రగా వర్లి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని రతన్‌ టాటాకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

Ratan Tata Net Worth 2024: ఆ ఒక్క కారణమే రతన్ టాటా పెళ్లికి అడ్డుగా నిలిచింది, ఆయన ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయల పై మాటే.. ఆసక్తికర విషయాలు మీకోసం.. 

శ్మశానవాటికలో పార్సీ సంప్రదాయాలకు అనుగుణంగా రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల తర్వాత, దక్షిణ ముంబైలోని కొలాబాలోని రతన్ టాటా బంగ్లాలో మరో మూడు రోజుల పాటు సంప్రదాయ ఆచారాలను నిర్వహించనున్నారు.

వర్లీ స్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ముంబై పోలీసులు టాటాను ఉత్సవ గన్ సెల్యూట్‌తో సత్కరించారు. 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి రతన్ టాటా పార్థివ దేహానికి గౌరవ వందనంతో ఘన నివాళులు అర్పించారు. ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటాతో సహా కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు.