IAS Study Circle Flooding: విద్యార్థుల జలసమాధి తర్వాత అలర్ట్ అయిన అధికారులు, అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
Delhi Rau’s IAS Study Circle Flooding: ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్‌లోకి (Coaching Centers) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వరదలకు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు జలసమాధి, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెండ్ చేసిన ఎంసీడీ
ఓల్డ్ రాజేందర్ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను గుర్తించారు. సెల్లార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయా కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు (Sealed). ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ఫ్లూటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ ఐఏఎస్, ఐఏఎస్ కోసం ఈజీ సెంటర్లు బేస్‌మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాటికి సీజ్ చేసి అందులో చదువుకుంటున్న అభ్యర్థులను ఖాళీచేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా కోచింగ్ సెంటర్ల ముందు అధికారులు నోటీసులు అంటించారు.
కోచింగ్ సెంటర్ భవనంలోని బేస్‌మెంట్‌లో వరదనీరు చేరి ముగ్గురు ఐఏఎస్‌లు మరణించిన ఘటనలో జూనియర్ ఇంజనీర్‌ను తొలగించి, అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎంసీడీ కమిషనర్ అశ్వనీకుమార్ సోమవారం తెలిపారు. కరోల్‌బాగ్ జోన్‌కు సంబంధించి నిర్వహణ శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. త్వరలో రద్దు, సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.శనివారం భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని రావు యొక్క IAS స్టడీ సర్కిల్‌లోని నేలమాళిగలో వరదలు రావడంతో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మరణించారు. ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి ఉద్ధృతంగా వరద ఎలా వచ్చింది?.. దానికి కారణం ఏమిటీ? ప్రాణభయంతో స్టూడెంట్స్ ఎలా బయటకు పరిగెత్తారు?.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు బయటకు.. మీరూ చూడండి..!
శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు. రావూస్ అకాడమీలోకి నీళ్లు వచ్చే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరగా పైకి రండి, త్వరగా.. త్వరగా.. ఎవరైనా మిగిలిపోయారా? అక్కడ ఎవరైనా ఉన్నారా; అంటూ వీడియోలో ఆరాతీసూ ఓ వ్యక్తి కనిపించాడు
శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ఎదున విద్యార్థులు ధర్నాకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. స్టడీ సర్కిల్ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే ముగ్గురి మరణానికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లో పెద్ద ఎద్దును పోలీసులను మోహరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)