IAS Study Circle Videos

Newdelhi, July 29: ఢిల్లీలోని (Delhi) ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ (IAS Coaching Centre) బేస్‌ మెంట్‌ లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద ముగ్గురిని బలితీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోచింగ్ సెంటర్ ఎదురు రోడ్డుపై భారీగా వరద నీరు చేరగా ఓ ఎస్యూవీ  వాహనం నీటిలో వేగంగా వెళ్లడం వీడియోల్లో కనిపిస్తున్నది. ఆ వాటర్ ఫోర్స్ కి కోచింగ్ సెంటర్ గేటు ఊడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున నీరు సెల్లార్లోకి ప్రవేశించి ప్రమాద తీవ్రతను పెంచినట్టు అర్థమవుతున్నది. ఇక, సెల్లార్ లోకి నీరు వస్తుండటంతో విద్యార్థులు భయంభయంగా బయటకు పరుగులు తీస్తుండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ ప్రమాదంలో తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24) మరణించారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

నిబంధనల ఉల్లంఘన

బేస్‌ మెంట్ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగం తెలిపింది. భవనం నిర్మాణంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది. ప్రస్తుతం లైబ్రరీగా ఉపయోగిస్తున్న బేస్‌ మెంట్‌ ను స్టోర్‌ రూమ్‌ గా ఉపయోగించుకుంటామని అనుమతులు తీసుకున్నట్టు, అగ్నిమాపక శాఖ నుంచి కూడా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కూడా తీసుకోలేదని తేలింది.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు స్పాట్ డెడ్, బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, పోలీసుల దర్యాప్తు