New Delhi, July 29: ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే.కోచింగ్ సెంటర్ భవనంలోని బేస్‌మెంట్‌లో వరదనీరు చేరి ముగ్గురు ఐఏఎస్‌లు మరణించిన ఘటనలో జూనియర్ ఇంజనీర్‌ను తొలగించి, అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎంసీడీ కమిషనర్ అశ్వనీకుమార్ సోమవారం తెలిపారు.
కరోల్‌బాగ్ జోన్‌కు సంబంధించి నిర్వహణ శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. త్వరలో రద్దు, సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.శనివారం భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని రావు యొక్క IAS స్టడీ సర్కిల్‌లోని నేలమాళిగలో వరదలు రావడంతో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మరణించారు. ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి ఉద్ధృతంగా వరద ఎలా వచ్చింది?.. దానికి కారణం ఏమిటీ? ప్రాణభయంతో స్టూడెంట్స్ ఎలా బయటకు పరిగెత్తారు?.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు బయటకు.. మీరూ చూడండి..!
శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ఎదున విద్యార్థులు ధర్నాకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. స్టడీ సర్కిల్ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే ముగ్గురి మరణానికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లో పెద్ద ఎద్దును పోలీసులను మోహరించారు.