RBI: ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి అలర్ట్, రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

RBI (Credits: Twitter)

RBI cancels licenses of two co-operative banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

అంతే కాకుండా డిపాజిటర్లకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించే స్థితిలో లేనట్లు ఆర్‌బీఐ నిర్దారించింది. లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..

డిఐసీజీసీ ప్రకారం మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లు తిరిగి వారి అమౌంట్ పొందటానికి అర్హులని తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్‌లో 91.92 శాతం మంది డిపాజిటర్లు అర్హులుగా తెలుస్తోంది.