ATM Usage Charges: రూ.5 వేలు కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదా? పలు రకాల ఛార్జీలు పెంచుతూ నివేదికను తయారుచేసిన ఆర్బీఐ కమిటీ, నిశితంగా పరిశీలిస్తున్న అత్యున్నత అధికారులు
ఇందులో భాగంగా ఏటీఎం ఛార్జీలను (ATM Usage Charges) మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
New Delhi, June 23: కోవిడ్-19 కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎం ఛార్జీలను (ATM Usage Charges) మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వర్కర్లకు ఇచ్చే వీసాలు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్
ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు (nterchange fees) పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ (RBI committee) పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది.
ఇకపై జరిగే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు విత్‌డ్రాయల్ లిమిట్ రూ.5,000 చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమించిన కమిటీ సిఫార్సు చేసినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు... ఎక్కువ డ్రా చేసేవాళ్లకు ఛార్జీలు వేయాలని ఆ కమిటీ సూచించింది. ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని ఆ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. వ్యవసాయంపైనే ఆశలు, వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట, రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గింపు, మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని కోరింది. ఈ కమిటీ ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం-RTI ద్వారా ఈ రిపోర్ట్‌ను సంపాదించారని, ఆ రిపోర్ట్‌లో ఈ విషయాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి.
ఏటీఎం ఇంటర్ ఛార్జ్ ఫీజులు ఎలా ఉండాలన్నదానిపై ఆర్‌బీఐ ఈ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫార్సుల్ని కూడా ఆర్‌బీఐకు నివేదికలో వెల్లడించింది. అయితే ఆర్‌బీఐ ఈ సిఫార్సులకు అంగీకారం తెలిపిందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఏటీఎం ఛార్జీలు 16 శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షాన్స్‌కు రూ.17, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.7 చొప్పున ఏటీఎం ఛార్జీలు వసూలు చేయాలని కమిటీ తెలిపింది.
10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలకు ఈ ఛార్జీలు వర్తించేలా చేయాలని కోరింది. 10 లక్షల లోపు ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలను 24 శాతం పెంచాలని కోరింది. కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.