US Suspends H1B&US Work Visas: అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్
US President Donald Trump (Photo Credits: IANS)

Washington, June 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ 1బీ వీసాను (H1B Visa) తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ను అమెరికా ప్ర‌భుత్వం (US Govt) ర‌ద్దు చేయడంతో ఈ వీసాల ర‌ద్దు ప్ర‌భావం సుమారు 5,25000 మందిపై ప‌డ‌నున్న‌ది. వీసాలు కోల్పోతున్న‌వారిలో ఎక్కువ‌ శాతం హై స్కిల్డ్ టెక్నిక‌ల్ వ‌ర్క‌ర్లు, నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సీజ‌న‌ల్ హెల్ప‌ర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

ఈ ఏడాది మొత్తం కొత్త వీసాల ( US Work Visa) జారీ ఉండ‌ద‌ని ట్రంప్ తెలిపారు. కొత్త‌గా గ్రీన్‌కార్డులు జారీ చేయాల‌నుకున్న ల‌క్షా 70 వేల మందిపైన కూడా ప్ర‌భావం చూప‌నున్న‌ది. గ్రీన్‌కార్డు ఉన్న విదేశీయులు ప‌ర్మ‌నెంట్ రెసిడెంట్స్ అవుతారు. ఏప్రిల్ నెల‌లో జారీ చేసిన ఆదేశాల‌ను ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు పొడ‌గించ‌నున్న‌ట్లు అమెరికా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సీజ‌నల్ వ‌ర్క‌ర్లకు ఇచ్చే హెచ్‌-2బీ వీసాల‌ను దాదాపు పూర్తిగా ర‌ద్దు చేశారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధి కోసం ఇచ్చే జే-1 వీసాల‌ను కూడా హోల్డ్‌లో పెట్టేశారు. ప్రొఫెస‌ర్లు, స్కాల‌ర్స్‌కు మాత్రం దీని నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. బ‌హుళ‌జాతి కంపెనీల్లో మేనేజ‌ర్లకు ఇచ్చే ఎల్ వీసాల‌ను కూడా ర‌ద్దు చేశారు. నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర, ప్రజలు లేకుండా జగన్నాథుడి ఊరేగింపు, యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతన్న సుప్రీంకోర్టు

కొత్త ఆదేశాల ప్ర‌భావం ప్ర‌స్తుతం వీసా ఉన్న‌వారిపై ప‌డ‌ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇమ్మిగ్రేష‌న్ గ్రీన్‌కార్డుల‌ను స‌స్పెండ్ చేయ‌డం వ‌ల్ల భార‌తీయ‌ హెచ్‌1బీ టెకీ వీసాదారుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. సిలికాన్ వ్యాలీ కంపెనీలు త‌క్కువ జీతం తీసుకునే ఉద్యోగుల‌కు హెచ్‌1బీ వీసాలు జారీ చేశాయ‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. గ‌త ఏడాది సుమారు 225000 మంది హెచ్‌1బీ వీసాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తం 85 వేల స్పాట్స్ అందుబాటులో ఉండ‌గా.. 2.25 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు అధికారులు చెప్పారు.

Here's what Congressman Raja Krishnamoorthi has to say:

I’m deeply disappointed by President Trump’s misguided order to suspend H-1B and other key work visa programs. I urge him to reverse this decision to help ensure our health care system and economy are ready to combat the next phase of this pandemic and to create the jobs we need. pic.twitter.com/tz5j81cKNf

— Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) June 22, 2020

ఇక ఈ ఏడాది డిసెంబర్‌31 వరకూ హెచ్‌ 1బీ, హెచ్‌ 2బీ, జే 1, ఎల్‌ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్‌ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్‌ పిలుపు ఇచ్చారు. మెరిట్‌ ఆధారంగానే హెచ్‌1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది.

ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్‌ హెచ్‌ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్‌ పేర్కొంది.

ప్రస్తుతం యూఎస్‌ లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మొదటితో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు ప్రకారమైతే ఈ ఏడాది నవంబరు 3న జరగాలి. కోవిడ్‌కు తోడు అమెరికాలో సాగుతున్న జాత్యహంకార (జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి) నిరసన ఉద్యమంతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సహాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై పలు అనుమానాలను, ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్‌ ఓటింగ్‌కు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ఆసక్తికర అంశంగా మారింది.