New Delhi, May 22: దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో కేంద్ర రిజర్వ్ బ్యాంక్(RBI) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను (RBI New Repo Rates) చేసింది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ (Reserve Bank of India) సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6088 కోవిడ్ 19 కేసులు, ఇండియాలో లక్షా 18 వేలు దాటిన కరోనా కేసులు సంఖ్య, 3583కి చేరిన మృతుల సంఖ్య
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్‌దాస్ వెల్లడించారు. భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నాయి. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముడి పదార్థాల ఇన్‌పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోందని తెలిపారు. ముంబై-ఢిల్లీ కనీస టికెట్ ధర రూ. 3500, మినిమం ధర రూ. 10 వేలు, 3నెలల పాటు ఇదే ఛార్జీలు అమల్లో, వివరాలను వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గింది. 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిడ్‌బీ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు పెంపు ఉంటుంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది. టర్మ్‌లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుందని శక్తికాంత్ దాస్ అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ఒక్క వ్యవసాయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు శక్తికాంత్ తెలిపారు. రుతుపవనాలపై కేంద్ర వాతావరణశాఖ ఇస్తున్న సమాచారం వ్యవసాయం రంగంపై మరింత ఆశలను రేపుతున్నట్లు ఆయన చెప్పారు. ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.6 శాతానికి చేరినట్లు చెప్పారు. కూరగాయలు, నూనెదినుసులు, పాల ధరలు తారాస్థాయికి చేరినట్లు చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది నెగటివ్‌లోనే ఉంటుందన్నారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిడ్ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు.