New Delhi, May 22: దేశంలో నోవెల్ కరోనా వైరస్ (Coronavirus in India) కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,18,447కి చేరింది. కాగా 24 గంటల్లోనే 148 మంది మరణించడంతో దేశంలో మృతుల సంఖ్య (Coronavirus Deaths) 3583కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ముంబై-ఢిల్లీ కనీస టికెట్ ధర రూ. 3500, మినిమం ధర రూ. 10 వేలు, 3నెలల పాటు ఇదే ఛార్జీలు అమల్లో, వివరాలను వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 48,533 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 66,330 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో కరోనా రికవరీ రేటు 40.97 శాతంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 2వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో 60 మందికి పైగా కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఉన్న 80 శాతం బెడ్‌లను ఆగస్టు 31 వరకు బుక్ చేసుకున్నది. ఎపిడమిక్ డిసీజ్ చట్టం కింద మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ చట్టంతో ప్రైవేటు ఆస్పత్రి బెడ్‌లను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. చికిత్స బిల్లులపై ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసింది.