Flight Ticket Fare: ముంబై-ఢిల్లీ కనీస టికెట్ ధర రూ. 3500, మినిమం ధర రూ. 10 వేలు, 3నెలల పాటు ఇదే ఛార్జీలు అమల్లో, వివరాలను వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
Hardeep Singh Puri (Photo Credits: ANI)

New Delhi, May 21: కరోనా (Coronavirus) కారణంగా భారత్‌లో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ (Lockdown 4) సడలింపుల నేపథ్యంలో ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) గురువారం విలేకరుల సమావేశంలో విమాన టిక్కెట్ల ధరలు (Flight Ticket Fare) మరియు ఇతర వివరాలను పంచుకున్నారు. ఢిల్లీ-ముంబై విషయంలో (Mumbai-Delhi Maximum Flight Ticket Fare) 90-120 నిమిషాల మధ్య ప్రయాణానికి కనీస ఛార్జీలు రూ .3500, గరిష్ట ఛార్జీ రూ .10,000 ఉంటుందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ 5 ఉంటుందా లేక ఇదే లాస్ట్ అవుతుందా? ప్రారంభమైన విమానాలు, రైళ్లు, షాపులు, ఇండియా సాధారణ స్థితికి చేరుకున్నట్లేనా..?

మెట్రో సిటీలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా అని తెలిసిందే. మెట్రో సిటీ నుంచి మెట్రో సిటీకి ఎయిర్‌లైన్స్ ఆమోదం పొందిన సమ్మర్ షెడ్యూలు ఫ్లైట్స్‌లో మూడో వంతు నడుపుతాయి. నాన్ మెట్రో సిటీ నుంచి మెట్రో సిటీకి, మెట్రో సిటీ నుంచి నాన్ మెట్రో సిటీకి ప్రయాణించేందుకు కూడా ఎయిర్‌లైన్స్ ఆమోదం పొందిన సమ్మర్ షెడ్యూలు ఫ్లైట్స్‌లో మూడో వంతు నడుపుతాయి.

ఈ కనీస ఛార్జీ, గరిష్ఠ ఛార్జీ మూడు నెలలపాటు అంటే ఆగస్టు 24 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయన్నారు.

ప్రయాణ సమయాన్నిబట్టి రూట్లను ఏడు విధాలుగా విభజించినట్లు తెలిపారు. 0-40 నిమిషాలు, 40-60 నిమిషాలు, 60-90 నిమిషాలు, 90-120 నిమిషాలు, 120-150 నిమిషాలు, 150-180 నిమిషాలు, 180-210 నిమిషాలు అని తెలిపారు.

Minimum & Maximum Fare Set by Civil Aviation Minister

తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తల గురించి మాట్లాడుతూ క్యాబిన్ సిబ్బంది పూర్తి రక్షణ గేర్‌లో ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక చెక్-ఇన్ బ్యాగ్ మాత్రమే అనుమతించబడుతుంది. ప్రయాణీకులు బయలుదేరే సమయానికి కనీసం రెండు గంటల ముందు రిపోర్ట్ చేయాలి. ప్రయాణీకుడు COVID-19 లక్షణాల నుండి ఉచితమని నిర్ధారించడానికి అనుకూలమైన పరికరంలో స్వీయ-ప్రకటన లేదా ఆరోగ్య సేతు అనువర్తన స్థితి (Aarogya Setu app) పొందబడుతుంది. ఆరోగ్య సేతు యాప్‌లో రెడ్ స్టేటస్ ఉన్న ప్రయాణీకులను ప్రయాణించడానికి అనుమతించబోమని మంత్రి తెలియజేశారు. దేశీయ మరియు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన రెండు నెలల తరువాత మార్చి 25 నుండి విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి.

Here's ANI Tweet

40 శాతం టికెట్లు మధ్య రకంగా రూ. 6,750 కే అమ్ముకోవాలని, టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడో వంతు విమానాలు మాత్రమే నడుస్తాయని, మధ్య సీటును ఖాళీగా ఉంచమని స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ డిస్టెన్స్ పూర్తికాదని, ప్రతి ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిస్థాయిలో డిస్ ఇన్ఫెక్షన్ చేస్తామని పేర్కొన్నారు. మధ్య సీటు ఖాళీగా ఉంచితే 33 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే విమానంలోని అన్ని సీట్లకు టికెట్లు అమ్ముతామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా మధ్య సీటు ఖాళీగా ఉంచరని మంత్రి అన్నారు. అంఫాన్ దెబ్బకు విలవిలలాడిన వెస్ట్ బెంగాల్, దేశం యావత్తు మీకు అండగా నిలుస్తుంది, ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రధాని మోదీ

చైనా నుంచి విమానాల రాకపోకలను తొలుత భారత్‌యే ఆపేసిందని కేం‍ద్ర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ అన్నారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలను సమీక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగైన కొద్దీ విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. విమాన సర్వీసులు నడిపే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులతో కూడా చర్చించామని తెలిపారు.

వందే భారత్ మిషన్ కింద విదేశాలలో ఉన్న భారతీయులందరిని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే 20 వేల మంది ప్రయాణికులను తీసుకువచ్చామని, ఇక నుంచి ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఈ మిషన్ లో భాగస్వామ్యం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు, బ్లౌజు, ఫేస్ షీల్డ్‌లు ఇచ్చామని ఇచ్చామన్నారు. మొత్తం విమానయాన సర్వీసులలో 1/3 వంతు సోమవారం (25 మే)నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.

విమానాలలో ప్రయాణించే వారికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని మంత్రి హర్దీప్‌ సింగ్‌ తెలిపారు. విమానాలలో భోజన సౌకర్యం ఉండదని, రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. విమానాలు నడిచే మార్గాలను, ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి ఏడు భాగాలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు.