TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI

రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది

Credits: Twitter

తిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ-హుండీ ద్వారా పంపిన విరాళాల వివరాలు ఇవ్వలేదని.. ఇది...Foreign Contribution Regulation Act నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుందని ఆర్బీఐ తెలిపింది. విచిత్రమేమిటంటే.. వీరి వివరాలు టీటీడీకి కూడా తెలియవు

ఆదాయపన్ను రిటర్నుల్లో ఈ మొత్తాన్ని నమోదు చేసినా, వివరాలు ఇవ్వలేదని ఆర్బీఐ 2019కిగానూ రూ.1.14 కోట్లు, ఈ ఏడాది మార్చి 5న రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. ఏపీసీహెచ్‌ఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 111 పేరొన్నట్టు హుండీలో వేసిన కానుకలు టీటీడీ కార్పస్‌లో భాగమేనని టీటీడీ తన వాదనలను వినిపించింది. అయినా ఆర్బీఐ వినిపించుకోలేదు. దీంతో ఆ జరిమానాను టీటీడీ చెల్లించాల్సి వచ్చింది.

ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీటీడీకి యూఎస్‌ డాలర్లు రూ.11.50 కోట్లు, మలేషియా రింగిట్స్‌ రూ.5.93 కోట్లు, సింగపూర్‌ డాలర్లు రూ.4.06 కోట్లు అందాయి. ఈ మొత్తాన్ని టీటీడీ ఖాతాలో స్టేట్‌ బ్యాంక్‌ జమ చేయాలి. కానీ, మూడేండ్లు గడుస్తున్నా కదలిక లేదు. ఇదీ పరిస్థితి అని కేంద్రానికి విన్నవించినా, పట్టనట్టు వ్యవహరిస్తున్నదని జయరాం రమేష్ ట్వీట్ చేశారు.