Manoj Mukund Naravane: అమ్మాయిలతో రాసలీలలు సాగించేలా భారత గూఢాచారులు ఉండరు, జేమ్స్‌బాండ్ సినిమాల్లో లాగా గన్స్ పట్టుకుని తిరగరు, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో పనిచేయడం, శత్రువుల వార్తలు సేకరించడమే వారి విధి: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నారావణే
భారత గూఢచారులంటే (spy world) జేమ్స్ బాండ్ సినిమాల్లో (James bond movies)మాదిరిగా గన్స్ పట్టుకుని తిరుగుతూ, అమ్మాయిలతో కాలక్షేపం చేస్తూ (girls and guns) ఉండబోరని అన్నారు.
New, Delhi, December 22: త్వరలో ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నారావణే (Lt Gen Manoj Mukund Naravane) భారత గూఢాచారి వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత గూఢచారులంటే (spy world) జేమ్స్ బాండ్ సినిమాల్లో (James bond movies)మాదిరిగా గన్స్ పట్టుకుని తిరుగుతూ, అమ్మాయిలతో కాలక్షేపం చేస్తూ (girls and guns) ఉండబోరని అన్నారు.
ఇంటెలిజెన్స్ విభాగం ప్రజలు అనుకునేలా గ్లామరస్ గా ఉండదని, వారికి పని తప్ప వేరే వ్యాపకం తెలియదని ఆయన అన్నారు. నితిన్ గోఖలే రాసిన 'ఆర్ ఎన్ కావో జెంటిల్ మన్ స్పై మాస్టర్' పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిలిటరీ ఆపరేషన్స్ (military operations)విజయవంతం వెనుక గూఢచారుల పాత్ర ఎంతో ఉంటుందని ఆయన అన్నారు. భారత రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) తొలి చీఫ్ గా ఆర్ఎన్ కావో ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మిలిటరీ ఆపరేషన్స్, నిఘా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తుంటాయని, ఎప్పుడు ఆర్మీ ఆపరేషన్స్ గురించి తమకు తెలిసినా, శత్రువుల గురించిన వార్తలు సేకరించడమే తమ విధి అని ఆయన అన్నారు.
తమ కార్యకలాపాలు విజయవంతం అవుతాయంటే, ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం అత్యంత కీలకమని అన్నారు. దీనిని బట్టే వారి పనితీరు ఎలా ఉంటుందో చెప్పవచ్చని అన్నారు. సినిమాల్లో చూపించేది అంతా వాస్తవం కాదని తెలిపారు.
"గూఢచార కార్యకలాపాల గురించి ఆలోచిస్తే, సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కావాల్సినంత గ్లామర్, తుపాకులు, అమ్మాయిలతో రాస క్రీడలు అనుకుంటారు. కానీ నిఘా విభాగం ప్రపంచం వేరేలా ఉంటుంది. జాన్ లీ కారే రాసే స్పైలీ నవలల్లోలా పరిస్థితి అసలు కనిపించదు.
పరిచయం లేని, ఎవరూ వినని ప్రాంతాల్లో, విపత్కర పరిస్థితుల్లో పనిచేయాల్సి వుంటుంది" అని ఆయన అన్నారు. ఎంతో సమాచారాన్ని క్రోడీకరించి, సమాచారాన్ని పంచుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ కావోతో కలిసి పనిచేసిన రా మాజీ ప్రత్యేక కార్యదర్శి వీ బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.