UP Shocker: కాలికి పక్షవాతం, అయినా తల్లి బుల్లెట్ బండి, స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య, యూపీలో విషాద ఘటన

తల్లి తనకు కొత్త బుల్లెట్‌ బైకు (Bullet bike), ఫోను కొనివ్వలేదన్న క్షణికావేశంలో 18 ఏండ్ల యువకుడు ఆత్మహత్యకు (18-year-old Commits Suicide) పాల్పడ్డాడు.

Suicide (Photo Credits: Twitter)

Ghaziabad, Oct 12: యూపీలోని ఘజియాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్‌ బైకు (Bullet bike), ఫోను కొనివ్వలేదన్న క్షణికావేశంలో 18 ఏండ్ల యువకుడు ఆత్మహత్యకు (18-year-old Commits Suicide) పాల్పడ్డాడు. జిల్లాలో సుష్మా అనే మహిళ తన కుమారులు పీయూష్‌, పరాస్‌ తో కలిసి నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జీవిస్తున్నది. పీయూష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, పరాస్‌ పక్షవాతంతో బాధపడుతున్నాడు.

ఇంటర్‌ ఫస్టియర్‌ వరకు చదివిన పరాస్ కాలికి పక్షవాతం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత కొన్ని రోజులు నుంచి తన తల్లిని బుల్లెట్‌ బైకు, మొబైల్‌ ఫోను కొనివ్వాలని అడుగుతున్నాడు. అయితే అందుకు ఆమె తిరస్కరిస్తూ (Refused New Bike And Mobile Phone) వస్తున్నది. దీంతో మనస్థాపం చెందిన పరాస్‌.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

ఘోర ప్రమాదం వీడియో, పోలీస్ సిబ్బంది బస్సు కింద దూరిన బైక్, ఒక్కసారిగా పేలుడు, ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనం, బీహార్‌లో విషాద ఘటన

ఈ విషయం గుర్తించిన తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూమ్‌ తలుపులు బద్దలు కొట్టారు. అయితే అప్పటికే పరాస్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఏడాది క్రితం సైకిల్‌ కొనిపించనందుకు అలిగిన అతడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని తల్లి తెలిపింది.