Tamilnadu Shocker: కన్నతల్లిని 10 ఏళ్ల పాటు ఒకే గదిలో బంధించిన కొడుకులు, పోలీసుల సహకారంతో గది నుంచి బయటపడ్డ తల్లి, కొడుకులు కాదు రాక్షసులు...

ఎట్టకేలకు ఆమె బయటకు వచ్చి కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడు పోలీసులు వాళ్లిద్దరిపై కేసు ఫైల్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Representative image

వృద్ధురాలైన తల్లిని పదేళ్ల పాటు ఒకే గదిలో బంధించారు ఆయు కొడుకులు. ఎట్టకేలకు ఆమె బయటకు వచ్చి కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడు పోలీసులు వాళ్లిద్దరిపై కేసు ఫైల్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. చెన్నైలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే షణ్ముగం (50), పట్టుకొట్టాయ్‌లోని దూరదర్శన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అతని తమ్ముడు వెంకటేశన్ (45)లపై సెక్షన్ 24.. మెయింటైనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ అయింది.

Rajasthan: దేశంలో మరో మిస్టరీ వ్యాధి కలకలం, ఐదు రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి, జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో మరణించినట్లు తెలిపిన రాజస్థాన్ అధికారులు

తన తమ్ముడు వాళ్లమ్మకు వచ్చే నెల ఫించన్ రూ.30వేలును తీసుకుంటున్నాడని, ఆమె ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత వాడిదేనని మీడియా ముందుకు చెప్పుకొచ్చారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారి కథనం ప్రకారం.. 72ఏళ్ల వయస్సున్న జ్ఞానజ్యోతి అనే మహిళను కాపాడినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా సోషల్ మీడియాలో వీడియో చూసి ఎంక్వైరీ చేసి పోలీసులతో కలిసి సోషల్ వెల్ ఫేర్ అధికారులు సదరు బాధితురాలిని కాపాడారు. తంజావూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించారు.

ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆ వృద్ధురాలికి ఆహారం మాత్రమే పెడుతున్నారు. ఆమెకు ఆకలి వేసిన సమయంలో అలారం ప్రెస్ చేస్తే.. లాక్ చేసిన గదిలోకి బిస్కట్లు, ఫ్రూట్స్ విసిరేస్తుంటారు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న పోలీసులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ వారి సహకారంతో శుక్రవారం తలుపులు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వృద్ధురాలిని కాపాడారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif